ప్రేమలో పడ్డ సందీప్ వంగా

తెలుగు అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసినా డైరెక్టర్ సందీప్ వంగా ప్రేమలో పడ్డాడట. అదేంటి ఆయనకు పెళ్లి కూడా అయిపోయింది కదా మళ్లీ ఇప్పుడు [more]

Update: 2019-06-13 07:06 GMT

తెలుగు అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసినా డైరెక్టర్ సందీప్ వంగా ప్రేమలో పడ్డాడట. అదేంటి ఆయనకు పెళ్లి కూడా అయిపోయింది కదా మళ్లీ ఇప్పుడు ప్రేమలో పడడం ఏంటి అని అనుకుంటున్నారా? అదేమీ లేదండి.. ఈ సంచలన దర్శకుడు ముంబై నగరంతో ప్రేమలో పడిపోయాడట. అర్జున్ రెడ్డి రీమేక్ గా బాలీవుడ్ లో ‘కబీర్ సింగ్’ సినిమా రూపొందించడం కోసం ఆయన ముంబై వెళ్లారు. అక్కడ ఆయనకు ఓ లగ్జరీ అపార్ట్ మెంట్ ను కేటాయించారు. ఆయన అక్కడ ఉంటూనే సినిమాను పూర్తి చేసారు.

అయితే ఈసినిమా ప్రమోషన్స్ టైములో ఆయన మీడియా తో మాట్లాడుతూ…”ముంబై తనకు ఎంతగానో నచ్చిందని…‘‘కబీర్ సింగ్ కోసం నేను ఏడాదిగా ముంబైలోనే ఉండడంతో ఈ నగరం నాకెన్నో మర్చిపోలేని మధురానుభూతుల్ని మిగిల్చింది. అందుకే ముంబై నగరంతో నేను ప్రేమలో పడిపోయా అని అన్నారు. అంతేకాదు భవిష్యత్ లో కూడా ఇక్కడికి వస్తుంటాను. ముంబై నాకెప్పటికీ గుర్తుంటుంది’’ అంటూ సందీప్ రెడ్డి వంగా తన అనుభవాలను పంచుకున్నారు. ఇతని డైరెక్షన్ లో రిలీజ్ అవుతున్న ‘కబీర్ సింగ్’ మూవీ ఈనెల 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ కు భారీ స్పందన రావడంతో అంచనాలు పెరిగాయి

Tags:    

Similar News