అందరికి న్యాయం చేస్తా అంటున్నాడు!!

హాలీవుడ్ హీరో తనకి క్యాన్సర్ ఉన్నప్పటికీ.. ఆ క్యాన్సర్ తో పోరాడుతూనే బ్లాక్ బస్టర్ మూవీస్ చేసాడు. చివరికి తన ఇంట్లోనే క్యాన్సర్ ని తట్టుకోలేక కన్ను [more]

Update: 2020-09-11 05:41 GMT

హాలీవుడ్ హీరో తనకి క్యాన్సర్ ఉన్నప్పటికీ.. ఆ క్యాన్సర్ తో పోరాడుతూనే బ్లాక్ బస్టర్ మూవీస్ చేసాడు. చివరికి తన ఇంట్లోనే క్యాన్సర్ ని తట్టుకోలేక కన్ను మూసాడు. అయన సూపర్ అన్నారు. ఇక ఇర్ఫాన్ ఖాన్ కూడా క్యాన్సర్ కి ట్రీట్మెంట్ తీసుకుంటూనే  సినిమాలు చేసి చివరికి మరణించాడు. అలాగే యువరాజ్ సింగ్, మనీషా కొయిరాలా, మమతా మోహన్ దాస్ లాంటోళ్ళు క్యాన్సర్ ని జయించారు. తాజాగా బాలీవడో లో సంజయ్ దత్ కూడా క్యాన్సర్ బారిన పడ్డాడు. ఆయనకి నాలుగో స్టేజ్ ఉన్నప్పుడు కేన్సర్ బయటపడడంతో.. సంజయ్ దత్ నటిస్తున్న 1000 కోట్ల ప్రాజెక్ట్స్ అన్ని డైలమాలో పడ్డాయి.

సంజయ్ దత్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసమా అమెరికా వెళ్ళడానికి సిద్దమవుతున్నాడు. అయితే తాజాగా అమెరికా వెళ్లేలోగా అయన నటించాల్సిన సినిమా షూటింగ్స్ కి సంజయ్ దత్ హాజరవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయనకి ఎలాంటి సింటెమ్స్ లేకుండానే ఈక్యాన్సర్ మహమ్మారి బారిన పడ్డాడు. అయితే ప్రస్తుతం ముంబై లోనే కీమో థెరపీ చేయించుకుంటూ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటూనే…. కేన్సర్ ఒంట్లో ఉన్నా కూడా ఆయన షూటింగ్‌కు వస్తున్నాడు. గత రెండు రోజులుగా సంజయ్ దత్ షంషేర్ షూట్‌లో పాల్గొంటున్నాడు. ఓ వైపు కేన్సర్ తో పోరాడుతూనే సంజయ్ దత్ ఇలా షూటింగ్ చేస్తుండటం అభిమానులను కలవరపెడుతున్న విషయం. కానీ తన వలన నిర్మాతలు నష్టపోకూడదని… మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే అన్యాయమని భావించిన సంజయ్ దత్ అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే షూటింగ్‌కు వస్తున్నాడు. అయినా కూడా ఇలాంటి సమయంలో సంజయ్ షూటింగ్ కి రావడం మాత్రం ఆయనకి వర్క్ మీదున్న డెడికేషన్ అంటూ సంజయ్ దత్ ని పొగిడేస్తున్నారు.

Tags:    

Similar News