వివాదంలో నిత్యామీనన్.. ఏంటో..!

నిత్య చేసిన ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేద‌న్నాడు సంతోష్ వర్కీ.

Update: 2022-08-07 07:29 GMT

న‌టి నిత్యా మీన‌న్‌ పెళ్ళికి సంబంధించిన వార్తలు గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతూ వస్తున్నాయి. సంతోష్ వర్కీ అనే వ్యక్తి కొన్నేళ్లుగా తాను నిత్యా మీనన్‌ను ఇష్టపడుతున్నానని, ఆమెను వివాహం చేసుకోబోతున్నానని చెప్పి ఇటీవల వార్త‌ల్లో నిలిచాడు. నిత్యా మీనన్ స్పందిస్తూ.. సంతోష్ వర్కీ మాటలు వినే వారు మూర్ఖులు అని చెప్పింది. సంతోష్ వర్కీ పెళ్లి చేసుకోవాలని కొన్నాళ్లుగా వేధిస్తున్నాడ‌ని, 30కి పైగా మొబైల్ నంబర్ల నుంచి కాల్ చేస్తూ చికాకు పెడుతున్నాడని తెలిపింది. అయిన‌ప్ప‌టికీ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌కుండా అత‌డిని క్షమించానని చెప్పింది. తనను ఒక వ్యక్తి గత ఆరేళ్లుగా వేధింపులకు గురి చేశారని నిత్య చెప్పింది. సంతోష్‌ వర్కీ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం చేసి ఇబ్బందులకు గురి చేశాడని వాపోయింది. చాలా మంది అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారని, అయితే తాను మాత్రం అతన్ని క్షమించి వదిలేశానని తెలిపింది. సంతోష్‌ తనను చాలా రకాలుగా అన్‌ పాపులర్‌ చేశాడని, చివరకు తన తల్లిదండ్రులు కూడా ఈ వ్యవహారంపై అసహనం వ్యక్తం చేసి అతన్ని గట్టిగా హెచ్చరించారని పేర్కొంది. తన గురించి సంతోష్‌ చెప్పేవన్నీ అసత్యాలని వాటిని ఎవరూ నమ్మవద్దని కోరింది.

నిత్య చేసిన ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేద‌న్నాడు సంతోష్ వర్కీ. ఒక్క వ్యక్తి తన పేరు మీద ఎన్ని సిమ్‌కార్డులు కొంటాడో జనాలు ఊహించుకో వాల‌న్నాడు. నిత్యా మీనన్‌కు వేరే వ్యక్తితో నిశ్చితార్థం అయింద‌ని ఆమె త‌ల్లి చెప్పిందని. ఎటువంటి ఎంగేజ్మెంట్ జ‌ర‌గ‌లేద‌ని ఆమె తండ్రి త‌న‌కు చెప్పార‌న్నారు. తాను చాలా కంగారు ప‌డ్డాన‌ని తెలిపాడు. వాళ్లు త‌న‌పై లైంగిక వేధింపుల కేసు పెట్టబోతున్నారని తెలిసింద‌న్నాడు. నిత్యా గురించి ఈ విషయాలు తెలిసి ఉంటే నేను ఆమెతో ప్రేమలో పడి త‌న‌ చుట్టూ తిరిగేవాడిని కాదన్నాడు సంతోష్ వర్కీ. త‌న తండ్రి చనిపోయిన తర్వాత ఏ విషయంలోనూ జోక్యం చేసుకోకుండా.. త‌న ప‌ని తాను చేసుకుంటున్నాన‌ని అన్నాడు.


Tags:    

Similar News