పిల్లలని స్కూల్ కి పంపడం కన్నా.. 100 బాహుబలులు తియ్యొచ్చు

చిన్న పిల్లల్ని స్కూల్ కి పంపడం అనేది తల్లులకు పెద్ద పని. ఉదయమే లేచి వారిని రెడీ చేసి లంచ్ బాక్స్ పెట్టి.. స్కూల్ వ్యాన్ ఎక్కించేవరకు… [more]

Update: 2020-03-23 09:09 GMT

చిన్న పిల్లల్ని స్కూల్ కి పంపడం అనేది తల్లులకు పెద్ద పని. ఉదయమే లేచి వారిని రెడీ చేసి లంచ్ బాక్స్ పెట్టి.. స్కూల్ వ్యాన్ ఎక్కించేవరకు… పెద్ద యుద్ధమే చెయ్యాలి. మరి నిత్యం తల్లులకి జరిగే నిరంతర ప్రక్రియ ఇది. ఒక్కరోజు డాడీ కూతురినో కొడుకునో స్కూల్ కి పంపాలంటే.. ఆ తండ్రి కష్టం పగ వాడికి కూడా వద్దు అంటున్నాడు సరిలేరు నీకెవ్వరూ డైరెక్టర్ అనిల్ రావిపూడి. సరిలేరు నీకెవ్వరూ సినిమా షూటింగ్ సమయంలో అస్సలు తీరిక లేకపోయినా.. తన కూతుర్ని అనిల్ ఉదయమే లేచి.. స్కూల్ కి పంపేవాడట.

కారణం అనిల్ రావిపూడి భార్య భార్గవి రెండోసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు అనిల్ సరిలేరు షూటింగ్ తో బిజీగా ఉన్నప్పటికీ.. ఉదయమే లేచి తన కూతుర్ని రెడీ చేసి టిఫిన్ పెట్టి స్కూల్ కి పంపేవాడట. అయితే పిల్లల్ని స్కూల్ కి పంపడం కంటే 100 బాహుబలులని ఒంటి చేత్తో తియ్యోచు అంటూ ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఫన్నీగా చెబుతున్నాడు. బాహుబలిని ఎలాగో ఐదేళ్ళలో పూర్తి చేసి విడుదల చేసారు కానీ.. పిల్లల్ని స్కూల్ కి పంపాలంటే చాలా కష్టం అంటూ దణ్ణం పెడుతున్నాడు.

Tags:    

Similar News