మహేష్ – పరశురామ్ సర్కారు వారిపాట స్క్రిప్ట్ మారుస్తున్నారా?

మహేష్ బాబు – పరశురామ్ కలయికలో తెరకెక్కాల్సిన సర్కారు వారి పాట షూటింగ్ జనవరి నుండి మొదలు కాబోతుంది. అమెరికా లో సర్కారు వారి పాట ఫస్ట్ [more]

Update: 2020-12-11 05:46 GMT

మహేష్ బాబు – పరశురామ్ కలయికలో తెరకెక్కాల్సిన సర్కారు వారి పాట షూటింగ్ జనవరి నుండి మొదలు కాబోతుంది. అమెరికా లో సర్కారు వారి పాట ఫస్ట్ షెడ్యుల్ ప్లాన్ చేసుకున్న పరశురాంకి అమెరికా ప్రయాణం ఎప్పటికప్పుడు షాకిస్తూనే ఉంది. అందుకే ఈసారి అమెరికా షెడ్యూల్ ని పక్కనపెట్టి హైదరాబాద్ లోనే సర్కారు వారి పాట మొదలుపెట్టాలని సర్కారు టీం డిసైడ్ అయ్యిందట. అయితే ఈ గ్యాప్ లో సర్కారు వారి పాట స్క్రిప్ట్ ని ముందు పెట్టుకుని మహేష్ – పరశురామ్ లు రివ్యూ వేసుకోగా.. లాక్ డౌన్ ముందు కథ కొత్తగా అనిపించినా ఇప్పుడు కథ లోని కొన్ని సన్నివేశాలు బోర్ గాను రొటీన్ గాను కనిపించాయట.

అందుకే పరశురామ్ అండ్ మహేష్ లు ఆ రొటీన్ సన్నివేశాలను తప్పించి ఫ్రెష్ గా కొన్ని సీన్స్ యాడ్ చేస్తున్నారట. కథలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేస్తున్నారట. ఈ కథలో ముందు కీలకం అనుకున్న హీరో తల్లి పాత్ర లోని సీన్స్ ని మాత్రమే కాకుండా ఇప్పుడు ఆ తల్లిపాత్రకి సంబందించిన ఎపిసోడ్ మొత్తం ఎత్తేసినట్టుగా చెబుతున్నారు. హీరో తల్లి పాత్రని కట్ చేసి అక్కడ కామెడీ సీన్స్, ఒక ట్విస్ట్ జొప్పించినట్టుగా తెలుస్తుంది. అంటే లాక్ డౌన్ ముందు అనుకున్న కథకి మెరుగులు రంగులు అద్దడం కాదు.. ఏకంగా కొన్ని కొన్ని చోట్ల కథను మార్చెయ్యడమే జరుగుతుందట.

Tags:    

Similar News