మరోసారి వాయిదా పడిన సర్కారువారి పాట షూటింగ్?

మహేష్ బాబు – పరశురామ్ కాంబోలో తెరకెక్కనున్న సర్కారు వారి పాటని పరశురామ్ పూజ కార్యక్రమాలతో మొదలు పెట్టాడు. అయితే ముందు నుండి దర్శకుడు సర్కారు వారి [more]

Update: 2020-11-24 07:17 GMT

మహేష్ బాబు – పరశురామ్ కాంబోలో తెరకెక్కనున్న సర్కారు వారి పాటని పరశురామ్ పూజ కార్యక్రమాలతో మొదలు పెట్టాడు. అయితే ముందు నుండి దర్శకుడు సర్కారు వారి పాట షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ అమెరికా పరిసర ప్రాంతాల్లో జరాపాలనే యోచనలో ముందుగా అమెరికా షెడ్యూ ప్లాన్ చేసుకున్నాడు దర్శకుడు. కానీ చిత్ర బృందానికి వీసా ప్రోబ్లెంస్ తో ఒకసారి అమెరికా షెడ్యూల్ వాయిదా పడింది. మహేష్ ఈ మధ్యలో దుబాయ్ కి ఫ్యామిలీ ట్రిప్ వేసుకున్నాడు. ఇక పూజ కార్యక్రమాలు ముందుగానే ఫినిష అయినా మహేష్ – పరశురామ్ లు జనవరి ఫస్ట్ వీక్ నుండే సర్కారు వారి పాటని పట్టాలెక్కించబోతున్నారు. అయితే డిసెంబర్ నెలాఖరున చిత్ర బృందం మొత్తం అమెరికా వెళ్లాల్సి ఉంది.

అయితే మహేష్ సర్కారు వారి పాట అమెరికా షెడ్యూల్ మరోసారి వాయిదా పడినట్లుగా టాక్. మధ్యలో కరోనా వచ్చి ఒక్కసారిగా ప్లాన్ చేంజ్ చెయ్యగా… ఇప్పుడు మరోసారి సర్కారు వారి పాట షెడ్యూల్ లో మార్పులు జరుగుతున్నాయని సమాచారం.  సర్కారు వారి విషయంలో చిత్ర యూనిట్ మరోసారి మార్పులు చేయక తప్పడం లేదు. అమెరికా షెడ్యూల్ ని పోస్ట్ పోన్ చేసుకుని ముందుగా ఇక్కడ హైద్రాబాద్ లోనే  సర్కారు వారి పాట షూట్ ప్లాన్ చేసుకున్నాడట. ఇక్కడ హైదరాబాద్ లోనే సర్కారు వారి పాట కోసం పరశురామ్ అనుకున్న సెట్స్ లో షూటింగ్ మొదలు పెట్టి.. తర్వాత అక్కడ అమెరికాలో పరిస్థితులు అనుకూలించాక అక్కడి షెడ్యూల్ చేసుకోవచ్చని డిసైడ్ అయ్యాడట. అమెరికా లో సెకండ్ వెవ్ మొదలు కావడంతో చిత్ర బృందం ఈ నిర్ణయం తీసుకుననట్టుగా తెలుస్తుంది. 

Tags:    

Similar News