సర్కారువారిపాట ఫస్ట్ డే కలెక్షన్స్

తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో మహేష్ సరసన.. కీర్తి సురేష్ నటించింది. సినిమా నుంచి..

Update: 2022-05-13 07:56 GMT

హైదరాబాద్ : పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారువారిపాట సినిమా.. నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో మహేష్ సరసన.. కీర్తి సురేష్ నటించింది. సినిమా నుంచి విడుదలైన పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. కాగా.. తొలిరోజు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో సర్కారువారిపాట భారీ వసూళ్లు రాబట్టింది.

మొదటి రోజు నైజాంలో రూ.12.24 కోట్ల షేర్ రాబట్టగా.. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజే రూ.36.63 కోట్లషేర్ ను వసూలు చేసింది. ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టింది. మహేష్ మార్క్ కామెడీ.. యాక్షన్ సీన్లు, పాటలు సినిమాకు ప్లస్ అయ్యాయి. ఈ సినిమా లాభాలు సాధిస్తుందో లేదో తెలియాలంటే.. వారంరోజులు ఆగాల్సిందే.


Tags:    

Similar News