నాగచైతన్య మాస్ ని నమ్ముకుని చాలాసార్లే దెబ్బతిన్నాడు. అయినా చైతుకి మాస్ ఇమేజ్ మీద మక్కువ ఎక్కువే. అందుకే ఫస్ట్ ప్రిఫరెన్స్ మాస్ కే ఇస్తుంటాడు. ప్రేమమ్ వంటి సినిమాలో లవర్ బాయ్ గా ఆకట్టుకున్న చైతు యుద్ధం శరణంతో మళ్లీ మాస్ అంటూ బొక్క బోర్లా పడ్డాడు. ఇక క్లాస్ కుర్రాడిలా ఇరగదీద్దామనుకున్న శైలజారెడ్డి అల్లుడు కూడా యావరేజ్ గా నిలిచింది. అయితే చందు మొండేటి డైరెక్షన్ లో వస్తున్న సవ్యసాచిలో కూడా నాగ చైతన్య మాస్ గానే కనబడుతున్నాడు. మరి ఈ సినిమా తో అయినా హిట్ కొట్టి మాస్ మీదున్న మక్కువ తీర్చుకుంటాడా లేదో చూడాలి. రేపు విడుదల కాబోతున్న సవ్యసాచిపై పెద్దగా క్రేజ్ అయితే కనబడడం లేదు. సింగిల్ గా బరిలోకి దిగుతున్న ఈ సినిమాకి ఈ వారంలో ఏ సినిమా పోటీ అయితే లేదు.. కానీ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం కంగారు పెడుతున్నాయి. నాగ చైతన్య గత చిత్రాల ఎఫెక్ట్ ఈ చిత్రం మీద పడినట్లుగా అనిపిస్తుంది. ఎంతగా మాధవన్ క్రేజ్, చందు డైరెక్షన్ స్కిల్స్, కీరవాణి సంగీత మీద ఆసక్తి ఉన్నప్పటికీ.. ఎందుకో ఎక్కడో తేడా కొడుతోంది. అందుకే అడ్వాన్స్ బుకింగ్స్ కాస్త నీరసంగా అనిపిస్తున్నాయి.
మూడు సినిమాలతో పోటీ
దీపావళి సెలవుల్ని అయినా వినియోగించుకుందామంటే... వీక్ మిడిల్ లోనే అంటే మంగళవారం నవంబర్ 6నే భారీ క్రేజున్న విజయ్ - మురుగదాస్ ల కాంబోలో వస్తున్న సర్కార్ మూవీ విడుదల కాబోతుంది. అలాగే థగ్స్ అఫ్ హిందూస్తాన్, అదుగో చిత్రాలు కూడా సవ్యసాచికి స్పాట్ పెడుతున్నాయి. ఇప్పటివరకు పోస్ట్ పోన్ మీద పోస్ట్ పోన్ అయిన సవ్యసాచి ఆచితూచి డేట్ చూసుకుంటే ఇప్పుడు మరో మూడు సినిమాలు పోటీకి వచ్చేస్తున్నాయి. మరి కేవలం నాలుగు రోజుల్లోనే సవ్యసాచి లాగాల్సిందంతా లాగెయ్యాలి. కానీ చైతుకి ఉన్న క్రేజ్ తో అది సాధ్యమయ్యేలా కనబడడం లేదు. టాక్ సూపర్ హిట్ అయితే తప్ప సవ్యసాచి కి కష్టమే చూద్దాం. రేపు సవ్యసాచి జాతకం ఏమిటో తేలిపోతుంది.