సీన్ రివర్స్ అంటే ఇదేనా?

ఓటిటి లు అంటే డిజిటల్ స్త్రీమింగ్స్ వచ్చిన కొత్తల్లో.. చాలామంది నిర్మాతలు డిజిటల్ హక్కులను అమ్మేటప్పుడు ఓటిటి సంస్థలకు పలు కండిషన్స్ పెట్టేవారు. శాటిలైట్ హక్కులతో పోటీగా [more]

Update: 2020-08-18 05:58 GMT

ఓటిటి లు అంటే డిజిటల్ స్త్రీమింగ్స్ వచ్చిన కొత్తల్లో.. చాలామంది నిర్మాతలు డిజిటల్ హక్కులను అమ్మేటప్పుడు ఓటిటి సంస్థలకు పలు కండిషన్స్ పెట్టేవారు. శాటిలైట్ హక్కులతో పోటీగా డిజిటల్ హక్కులను అమ్మినప్పటికీ… తమ సినిమా విడుదలైన ఇన్ని రోజులకే మీరు మీ ఓటిటి ద్వారా ప్రసారం చెయ్యాలని నిబంధన పెట్టేవారు. చిన్న సినిమాలైతే 40 రోజులు, పెద్ద సినిమాలైతే 60 రోజుల తర్వాతే ప్రసారం చెయ్యాలని కండిషన్ మీదే డిజిటల్ హక్కులు అమ్మేవారు. అయితే ఓటిటీస్ వలన థియేటర్స్ మూత బడేలా ఉన్నాయని థియేటర్స్ యాజమాన్యాలు చేసిన గొడవకు నిర్మాతలు అలా చేసెవారు. ఓటిటీల హావ తగ్గించాలని ప్రొడ్యూసర్స్ గిల్టీ కూడా ఏర్పడి చర్చలు చేసేవారు.

కానీ ఇప్పుడు తారుమారైంది. థియేటర్స్ మూతబడి ఓటిటి హావ బాగా మొదలైంది. సినిమాలే కాదు… వెబ్ సీరీస్ తోనూ ఓటిటీలు దూసుకుపోతున్నాయి. అందుకే చాలామంది నిర్మాతలు ఓటిటీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక ఇప్పటివరకు ఓటిటీలకు కండిషన్స్ పెట్టిన నిర్మాతలు.. ఓటిటీలతో ఒప్పందానికి దిగుతున్నారు. కొన్ని సినిమాల నిర్మాతలు ఓటిటీలకు సినిమాని అమ్మేస్తే.. కొంతమంది అన్ని లెక్కలేసుకుని ఓటిటి బాట పట్టడానికి రెడీ అవుతున్నాయి. వి, నిశ్శబ్దం, ఉప్పెన, రెడ్ సినిమాలు థియేటర్స్ దిక్కులేక ఓటిటిలోనే విడుదల కావడానికి రెడీ ఆసీవుతున్నాయి. అయితే ఈ సినిమాలు ఒత్తిడిలో విడుదలైన మళ్ళీ థియేటర్స్ తెరుచుకున్నాక థియేటర్స్ లో కూడా విడుదల చేసుకునే ఒప్పందానికి నిర్మాతలు ఉన్నారట.

అందులో భాగం గానే ఓటిటీలకు ఈ రకమయిన ఒప్పందాన్ని పెడుతున్నారట.  ఓటిటిలో ఎప్పుడు విడుదలైన మల్లి థియేటర్స్ సినిమాని విడుదల చేసుకునే అనుమతులు ఉంటాయి. అయితే చాలామంది ఓటిటీలలో సినిమాలు చూసాక మల్లి థియేటర్స్ కి వెళ్లారు. కానీ బిసి సెంటర్స్ వారికీ ఓటిటి పెద్దగా ఇంట్రెస్ట్ లేని పాయింట్. వాళ్ళకి థియేటర్స్ లోనే సినిమాలు చూస్తే కిక్ ఉంటుంది. అందులోను చాలామందికి ఓటిటీల వ్యవహారాలు తెలియవు. ఆ రకంగా సినిమా థియేటర్స్ లో విడుదలైన మంచి కలెక్టన్స్ వస్తాయని నిర్మాతల నమ్మకం. అందుకే నిర్మాతలు ఇప్పుడు ఓటైటిలను సంప్రదిస్తున్నారు. 

Tags:    

Similar News