చిరు కోసం అప్పుడే.. రెడీనా?
చిరంజీవి కోసం రామ్ చరణ్ మలయాళ లూసిఫెర్ రీమేక్ రైట్స్ కొనేసాడు. ఈ సినిమాని సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. సాహో సినిమా ప్లాప్ అయినప్పటికీ… [more]
చిరంజీవి కోసం రామ్ చరణ్ మలయాళ లూసిఫెర్ రీమేక్ రైట్స్ కొనేసాడు. ఈ సినిమాని సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. సాహో సినిమా ప్లాప్ అయినప్పటికీ… [more]
చిరంజీవి కోసం రామ్ చరణ్ మలయాళ లూసిఫెర్ రీమేక్ రైట్స్ కొనేసాడు. ఈ సినిమాని సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. సాహో సినిమా ప్లాప్ అయినప్పటికీ… సాహో లోని యాక్షన్ సీక్వెన్సెస్ కి హాలీవుడ్ రేంజ్ పేరొచ్చింది. అందుకే సుజిత్ పనితనం మీద చిరు కి నచ్చి లూసిఫెర్ రీమేక్ అప్పగించాడు. అయితే చిరు లూసిఫెర్ సినిమా రీమేక్ స్క్రిప్ట్ ఇచ్చి తెలుగు నేటివిటీకి తగినట్లుగా స్క్రిప్ట్ ని పూర్తి చెయ్యమని అప్పజెప్పారట.
ఇక సుజిత్ కూడా చిరు కొరటాల శివ సినిమాతో బిజీగా వున్నాడు కాబట్టి… ఈలోపు లూసిఫెర్ స్క్రిప్ట్ ని నెమ్మదిగా పూర్తి చెయ్యాలనుకున్నాడట, ఇంతలోపు కరోనా లాక్ డౌన్ రావడంతో చిరు ఆచార్య షూటింగ్ కి బ్రేకిచ్చి లూసిఫెర్ స్క్రిప్ట్ కోసం తన ఐడియాస్ ని సుజిత్ కి ఫోన్ లో చెప్పడం, అంతేకాకుండా తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా లూసిఫెర్ స్క్రిప్ట్‌లో కొన్ని కీలకమైన మార్పులను చిరు సూచించాడని.. సుజీత్ కూడా చిరు చెప్పిన ఆ మార్పులను పూర్తి చేసి చిరుకి స్క్రిప్ట్ వినిపించాడని,.. చిరు కి సుమిత్ చెప్పిన స్క్రిప్ట్ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ వినబడుతుంది. ఇక ఈ లూసిఫెర్ తెలుగు స్క్రిప్ట్ లో హీరోయిజమ్ ఎలివేషన్స్ ఉన్న సన్నివేశాలు సినిమాలోనే మెయిన్ హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు.