గూగుల్ లోకి వెళ్లి 'RRR' అని టైప్ చేసి చూడండి..!
బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన మరో పాన్ ఇండియా చిత్రం ఆర్‌ఆర్‌ఆర్
రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ సినిమాకు భారీగా స్పందన వస్తున్న సంగతి తెలిసిందే..! ఎన్నో దేశాలకు చెందిన ప్రముఖులు ఈ సినిమాను ప్రశంసించారు. రాజమౌళి తీసిన RRR ఇప్పటివరకు ఏ భారతీయ చిత్రానికి దక్కని ప్రశంసలను దక్కించుకుంటూ వెళుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో కూడా ఈ సినిమా సందడి చేస్తూ ఉంది. పశ్చిమ దేశాల్లోనూ ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. నెట్‌ఫ్లిక్స్‌లో దాదాపు 60 దేశాలలో ట్రెండ్ అయ్యింది. ఒక భారతీయ చిత్రానికి ఈ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు.
తాజాగా ఈ సినిమాకు గూగుల్ సరికొత్త ట్రిబ్యూట్ ను ఇచ్చింది. గూగుల్ లోకి వెళ్లి ఆర్ఆర్ఆర్ అని టైపు చేసామంటే చాలు సరికొత్త యానిమేషన్ మీకు కనిపిస్తుంది. Googleలో "RRR"ని సెర్చ్ చేసినప్పుడు, సెర్చ్ బార్ కింద బైక్, గుర్రం యానిమేషన్ కనిపిస్తుంది. బైక్, గుర్రం RRR సినిమాలో ఒక భాగమన్న సంగతి తెలిసిందే..! సినిమాలో రామ్ చరణ్ గుర్రం మీద కనిపిస్తాడు, ఎన్టీఆర్ బైక్ నడుపుతాడు. గూగుల్ భారతీయ చలనచిత్రం కోసం యానిమేషన్‌ను ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. మీరు కూడా గూగుల్ లోకి వెళ్లి ఆర్ఆర్ఆర్ అని టైప్ చేసి చూడండి.
బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన మరో పాన్ ఇండియా చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. భారతీయ సినిమాలకు సంబంధించి అంతకుముందున్న రికార్డులను తన పేరిట లిఖించుకుంది. ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో మే 20 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను వీక్షించిన వారంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులో హాలీవుడ్ ప్రముఖులు దర్శకులు, నటులు, టెక్నీషియన్లు కూడా ఉన్నారు.