‘సీత’ నెంబర్ వన్..!

ఒక సినిమా రేంజ్, క్రేజ్ ఏంటో తెలియాలంటే ఆ సినిమా వీడియో యూట్యూబ్ లో ఎన్ని వ్యూస్ వచ్చాయని చూస్తే అర్ధం అయిపోతుంది. స్టార్ హీరోల సినిమాలకి [more]

Update: 2019-05-12 07:54 GMT

ఒక సినిమా రేంజ్, క్రేజ్ ఏంటో తెలియాలంటే ఆ సినిమా వీడియో యూట్యూబ్ లో ఎన్ని వ్యూస్ వచ్చాయని చూస్తే అర్ధం అయిపోతుంది. స్టార్ హీరోల సినిమాలకి అయితే ఏ వీడియో పెట్టినా జనాధరణ లభిస్తుంది. ఎందుకంటే ఆయా హీరోల సదరు వీడియోలని మళ్లీ మళ్లీ చూసేసి వ్యూస్‌ పెంచుకుంటుంటారు. కానీ చిన్న సినిమాల పరిస్థితి అలా కాదు. అయితే బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా నటిస్తున్న ‘సీత’ చిత్రానికి సంబంధించి ఏ వీడియో పెట్టినా బ్రహ్మాండమైన ఆధరణ లభిస్తోంది. టీజర్ కి నాలుగు మిలియన్ల వ్యూస్‌ వస్తే, బుల్‌రెడ్డి అనే లిరికల్ వీడియోకి రెండు మిలియన్‌ వ్యూస్‌ వచ్చి ఆ సినిమా రేంజ్ కి పెంచుతున్నాయి.

టాప్ ట్రెండింగ్ లో ట్రైలర్

ఇక లేటెస్ట్ గా ట్రైలర్ రిలీజ్ అయ్యి మరో రికార్డుని క్రియేట్ చేసింది. తాజాగా ఈ ట్రైలర్ రెండు రోజుల్లోనే రెండు మిలియన్లు దాటి ఇప్పటికీ నంబర్‌ వన్‌ ప్లేస్‌లో ట్రెండ్‌ అవుతోంది. డైరెక్టర్ తేజ సినిమాలోని పాత్రలు చాలా కొత్తగా తీర్చిదిద్దారని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. ముఖ్యంగా కాజల్, సోనూ సూద్‌ క్యారెక్టర్లు చాలా కొత్తగా అనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా ఈ నెలలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది.

Tags:    

Similar News