రొమాంటిక్ సెట్స్ లో ఫైర్

మెహబూబా హీరో, పూరి జ్ఙానంద్ తనయుడు ఆకాష్ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ సినిమా ఫస్ట్ లుక్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. రొమాంటిక్ సినిమా టైటిల్ కి [more]

Update: 2019-10-15 08:41 GMT

మెహబూబా హీరో, పూరి జ్ఙానంద్ తనయుడు ఆకాష్ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ సినిమా ఫస్ట్ లుక్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. రొమాంటిక్ సినిమా టైటిల్ కి తగ్గట్టుగా రొమాంటిక్ సినిమా ఫస్ట్ లుక్ ఉంది. ఆ రొమాంటిక్ పోస్టర్ మీద కొంతమంది ఆసక్తికరంగా స్పందిస్తే మరికొంతమంది మరీ రొమాన్స్ ఎక్కువైంది. ఇప్పుడే ఆకాష్ పూరికి ఇలాంటివి అవసరమా అన్నారు. అయినా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న రొమాంటిక్ సినిమా సెట్స్ లో అగ్నిప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది.

క్లారిటీ లేని ప్రమాదం…

ఇన్‌డోర్ సెట్‌లో షూటింగ్ జరుపుకుంటున్న రొమాంటిక్ సెట్స్ లోని ఓ బట్టకు మంట అంటుకోవడం తర్వాత ఆ మంటలు క్షణాల్లో సెట్స్ కి పాకిపోవడం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న మాట. యూనిట్ సభ్యులు మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాలేదని తెలుస్తుంది. అయితే షూటింగ్ సమయంలో ఈ అగ్నిప్రమాదం జరిగిందా? లేదంటే షూటింగ్ ప్యాకప్ చెప్పాక జరిగిందో అనేది క్లారిటీ లేదు కానీ రొమాంటిక్ సెట్స్ లో అగ్నిప్రమాదం మాత్రం ప్రస్తుతం ఓ వీడియో రూపంలో ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది.

 

Tags:    

Similar News