రెండు బయోపిక్ లకు సెన్సార్ కష్టాలు!

ప్రస్తుతం అత్యంత క్రేజ్ తో విడుదలకు సిద్దమైన ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు సినిమా సెన్సార్ కష్టాలు ఎదుర్కొంటుంది. బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రధారిగా దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ఎన్టీఆర్ [more]

Update: 2019-01-03 07:48 GMT

ప్రస్తుతం అత్యంత క్రేజ్ తో విడుదలకు సిద్దమైన ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు సినిమా సెన్సార్ కష్టాలు ఎదుర్కొంటుంది. బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రధారిగా దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ సంక్రాతి కానుకగా వచ్చే వారం అంటే జనవరి 9న విడుదల కాబోతుంది. అయితే ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడుకి సెన్సార్ వారు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. అయితే సెన్సార్ వారు అలా చెయ్యడానికి కారణం ఏమిటంటే… బయోపిక్ లు అంటే జీవిత చరిత్ర నేపథ్యంలో తెరకెక్కుతుండటంతో… ఆ సినిమాలలోని పాత్రలకు సంబంధించిన వ్యక్తులు బతికి ఉంటే… వారు ఏదో ఒక అఅభ్యంతరం పెట్టి అల్లరల్లరి చేస్తారు. అందుకే ఆయా సినిమాల్లో వచ్చే పాత్రలు బ్రతికే ఉంటే గనక… వారి వద్ద నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకొచ్చాకే సెన్సార్ వారు సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తారు.

వర్మ సినిమాకూ కష్టాలు తప్పవా..?

ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ పరిస్థితి అలానే ఉంది. కథానాయకుడు సినిమాలోనే కాదు… ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడు కి సెన్సార్ కూడా సెన్సార్ వారు ఇదే మెలిక పెట్టేశారని తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలకే ఈ సమస్య కాదు.. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ పరిస్థితి కూడా ఇదే అన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ బయోపిక్ నుండి విడుదలైన వెన్నుపోటు పాట బాగా వివాదాస్పదమైంది. మరి రామ్ గోపాల్ వర్మ సెన్సార్ దగ్గర నుండి ఈ సినిమాకి ఎలా సెన్సార్ సర్టిఫికెట్ తెచ్చుకుంటాడో కానీ… ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడుకి మాత్రం సెన్సార్ ఇబ్బందులు ఉండవని.. ఎందుకంటే ఎన్టీఆర్ నటజీవితంలో పెద్దగా కాంట్రవర్సీలు లేవు కాబట్టి. కానీ మహానాయకుడు విషయంలో అలా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే మహానాయకుడి రాజకీయ నేపథ్యంతో కూడుకున్నది. మహానాయకుడులో ఎలాంటి కాంట్రవర్సీలు ఉండబోతున్నాయో, వాటి వల్ల సెన్సార్ కష్టాలు ఎంతగా ఉంటాయో అనేది ఈ నెలాఖరున కానీ తెలియదు. ఎందుకంటే మహానాయకుడు ఫిబ్రవరి 7న విడుదలవుతుంది.

Tags:    

Similar News