నటుడు, నిర్మాత విజయ్ పై రేప్ కేసు నమోదు
మలయాళ చిత్ర పరిశ్రమలో విజయ్ బాబుకు నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా మంచి గుర్తింపు ఉంది. విజయ్ బాబుపై ఓ మహిళ లైంగిక..
కోజికోడ్ : డ్రగ్స్, రేప్ కేసులు చిత్రపరిశ్రమను ఊపేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకూ డ్రగ్స్ కేసులతో విసిగిపోయిన చిత్ర పరిశ్రమలో.. ఇప్పుడు ఓ నటుడిపై నమోదైన రేప్ కేసు సంచలనం రేపుతోంది. మలయాళ ఇండస్ట్రీకి చెందిన నటుడు, నిర్మాత విజయ్ బాబుపై అత్యాచార ఆరోపణలు వచ్చాయి. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటూ ఓ మహిళపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు కేరళలోని కోజికోడ్ లో కేసు నమోదయింది. విజయ్ బాబుపై రేప్ కేసు నమోదవ్వడంతో.. నటీనటులు, అభిమానులు షాకయ్యారు.
మలయాళ చిత్ర పరిశ్రమలో విజయ్ బాబుకు నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా మంచి గుర్తింపు ఉంది. విజయ్ బాబుపై ఓ మహిళ లైంగిక ఆరోపణలు చేస్తోంది. అతనిపై కేరళలోని కోజికోడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి.. తనపై విజయ్ బాబు పలుమార్లు అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. ఏప్రిల్ 22వ తేదీన విజయ్ బాబుపై ఓ మహిళ ఫిర్యాదు చేసినా.. ఇంతవరకూ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకోలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. విజయ్ బాబుపై ఫిర్యాదు చేసి 5 రోజులు గడిచినా.. అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. కాగా.. విజయ్ బాబు ఆచూకీ పోలీసులకు తెలియలేదని సమాచారం.