జవాన్ బ్లాక్ బస్టర్ అందుకున్నా.. ఆ రికార్డు ప్రభాస్ పేరు మీదనే..
జవాన్ తో షారుఖ్ ఖాన్ ఒక రికార్డు సాధించినప్పటికీ ప్రభాస్ సృష్టించిన ఒక రికార్డుని మాత్రం బ్రేక్ చేయలేకపోయాడు.
షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన జవాన్ (Jawan) మూవీ ఈ గురువారం ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ఫస్ట్ డేనే ఈ చిత్రం 125 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకొని సంచలనం సృష్టించింది. పఠాన్, జవాన్ తో ఇలా బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల ఓపెనింగ్ సాధించిన బాలీవుడ్ హీరోగా షారుఖ్ కొత్త రికార్డుని క్రియేట్ చేశాడు.
అయితే షారుఖ్ ఇలా రికార్డు సాధించినప్పటికీ ప్రభాస్ సృష్టించిన ఒక రికార్డుని మాత్రం బ్రేక్ చేయలేకపోయాడు. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద జవాన్ చిత్రం రూ.125.05 కోట్ల కలెక్షన్లు అందుకొని.. ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో చిత్రంగా నిలిచింది. మొదటి స్థానంలోనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆదిపురుష్ రూ.136.84 కోట్ల కలెక్షన్స్ అందుకొని నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచింది. ప్రభాస్ (Prabhas) 'ఆదిపురుష్' మూవీ
ఇక సెకండ్ ప్లేస్ లో జవాన్ ఉండగా.. రూ.106 కోట్లతో పఠాన్, రూ.95.78 కోట్లతో జైలర్, రూ. 61.53కోట్లతో పొన్నియన్ సెల్వన్-2 చిత్రాలు తర్వాతి స్థానంలో నిలిచాయి. దీంతో ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. ఆదిపురుష్ సినిమా ప్లాప్ గా నిలిచింది. జవాన్ బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. అయినా ప్రభాస్ రికార్డుని షారుఖ్ బ్రేక్ చేయలేకపోయాడు అంటూ నెట్టింట డార్లింగ్ అభిమానులు సందడి చేస్తున్నారు.
కాగా జవాన్ రెండో రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే.. మొదటిరోజు 100 కోట్లు అందుకున్న ఈ మూవీ రెండో రోజు మాత్రం చాలా పూర్ కలెక్షన్స్ చూసింది. మొత్తం రెండు రోజుల్లో ఈ చిత్రం.. కేవలం రూ.129 కోట్ల కలెక్షన్స్ మాత్రమే అందుకుంది. మరి వచ్చే రెండు రోజులు వీకెండ్ కాబట్టి.. కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది.