బన్నీ డాన్స్ కి మరో బాలీవుడ్ హీరో ఫిదా?

అల్లు అర్జున్ డాన్స్ అంటే ఇష్టపడని వారుండరు. స్టైలిష్ డాన్స్ కి అల్లు అర్జున్ పెట్టింది పేరు. కొత్త స్టెప్స్ ని దింపడంలో అల్లు అర్జున్ ముందుంటాడు. [more]

Update: 2020-05-14 08:44 GMT

అల్లు అర్జున్ డాన్స్ అంటే ఇష్టపడని వారుండరు. స్టైలిష్ డాన్స్ కి అల్లు అర్జున్ పెట్టింది పేరు. కొత్త స్టెప్స్ ని దింపడంలో అల్లు అర్జున్ ముందుంటాడు. అలా వైకుంఠపురంలో బన్నీ డాన్స్ కి ఫిదా కానివారు లేరు. బుట్ట బొమ్మ సాంగ్ అయితే దేశ విదేశాల్లో పాపులర్ అయ్యింది. అల్లు అర్జున్ డాన్స్ అంటే బాలీవుడ్ హీరోలకు చాలామందికి క్రేజ్ ఉంది. మొన్నామధ్యన బన్నీ ఏం తింటున్నావయ్యా.. ఇంత ఎనర్జిటిక్ గా డాన్స్ చేస్తున్నావ్… నీ డాన్స్ కి నేను ఫ్యాన్ ని అంటూ హ్రితిక్ రోషన్ ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు. తాజాగా మరో బాలీవుడ్ హీరో అల్లు అర్జున్ డాన్స్ ని ఎక్కువగా ఇష్టపడతాను అంటున్నాడు. బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న షాహిద్ కపూర్ కబీర్ సింగ్ సినిమాతో తెగ పాపులర్ అయ్యాడు. సందీప్ వంగ డైరెక్షన్ చేసిన కబీర్ సింగ్ తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న షాహిద్ ప్రస్తుతం మరో తెలుగు రీమేక్ జెర్సీ సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా లక్డౌన్ తో ఇంటికే పరిమితమైన షాహిద్ కపూర్ సోషల్ మీడియాలో ఇంటరాక్ట్ అయ్యాడు.

జెర్సీ రీమేక్ లో తన తండ్రి పంకజ్ కపూర్ తో కలిసి నటించడం బావున్నప్పటికీ.. ఇప్పటికి ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం భయమని చెప్పాడు. ఇక ఫుడ్ బాల్ క్రికెట్ లలో క్రియేక్ట్ అంటే ఇష్టమని, స్కూల్ రోజుల్లో మేథ్స్ అంటే ఇష్టం ఉండేది కాదని, క్రికెటర్ కోహ్లి న్యూ లుక్ తనని బాగా ఇంప్రెస్స్ చేసింది అని.. ప్రస్తుతం కరోనా లక్డౌన్ తో ఫ్రీ టైం లో ఓటిటి లో అమెజాన్ ప్రైమ్ లో ద ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ చూస్తున్నట్లు చెప్పిన షాహిద్ కపూర్ కి అల్లు అర్జున్ డాన్స్ అంటే ఇష్టమట. అల్లు అర్జున్ గురించి ఒక్కమాటలో చెప్పమనగానే అల్లు అర్జున్ డాన్స్ అంటే చాలా ఇష్టం అంటూ చెప్పాడు. సో అల్లు అర్జున్ పాన్ ఇండియా పుష్ప సినిమా కి ఈ పబ్లసిటీ బాగా పనికొచ్చేలాగానే కనబడుతుంది.

Tags:    

Similar News