ఇక నా వల్ల కాదంటున్న డైరెక్టర్?
కమల హాసన్ హీరోగా దర్శకుడు శంకర్ లైకా ప్రొడక్షన్స్ లో భారతీయుడు 2 సినిమాని చాలా గ్రాండ్ గా మొదలు పెట్టాడు. భారీ బడ్జెట్ తో మొదలైన [more]
కమల హాసన్ హీరోగా దర్శకుడు శంకర్ లైకా ప్రొడక్షన్స్ లో భారతీయుడు 2 సినిమాని చాలా గ్రాండ్ గా మొదలు పెట్టాడు. భారీ బడ్జెట్ తో మొదలైన [more]
కమల హాసన్ హీరోగా దర్శకుడు శంకర్ లైకా ప్రొడక్షన్స్ లో భారతీయుడు 2 సినిమాని చాలా గ్రాండ్ గా మొదలు పెట్టాడు. భారీ బడ్జెట్ తో మొదలైన ఈ సినిమా కి మొదటి షెడ్యూల్ చక్కగా జరిగిపోయింది. ఇక తర్వాత భారతీయుడు 2 షూటింగ్ లో క్రేన్ ప్రమాదంలో కొంతమంది టెక్నీకల్ సిబ్బంది చనిపోవడం, అది కాస్తా కేసు అవడంతో భారతీయుడు 2 షూటింగ్ కి బ్రేక్ పడింది. అయితే తర్వాత లైకా నిర్మాతలకు – దర్శకుడు శంకర్ కి మధ్యన మాటల యుద్ధం కూడా నడిచింది. కానీ షూటింగ్ మొదలు కాలేదు. ఇక కరోనా కారణముగా అన్ని షూటింగ్స్ ఆగి మళ్ళీ మొదలవుతున్న తరుణంలో దర్శకుడు శంకర్ భారతీయుడు 2 పై లైక వారికీ ఓ ఘాటు లేఖ రాసాడట.
భారతీయదు షూటింగ్ ని త్వరగా మొదలు పెట్టమని, షూటింగ్ విషయమై వెంటనే ఏదో ఒకటి తేల్చాలని, ఒకవేళ సినిమా షూటింగ్ లేట్ అయ్యేలా ఉంటె.. తాను మరొక సినిమా మొదలు పెట్టుకుంటానని లైకా ప్రొడక్షన్స్ వారికీ దర్శకుడు శంకర్ ఘాటైన లేఖాస్త్రం సందించినట్లుగా తెలుస్తుంది. అయితే లైకా ప్రొడక్షన్ వారు మాత్రం దర్శకుడు శంకర్ తో భారతీయుడు సినిమా బడ్జెట్ కంట్రోల్ చెయ్యమని, అందులోని క్రేన్ ప్రమాదంలో చాలా ఖర్చుపెట్టామని, కాబట్టి సినిమా బడ్జెట్ విషయంలో కాస్త చూసుకోమని చెబుతుంటే.. శంకర్ మాత్రం క్వాలిటీ విషయంలో రాజి పడలేనని చెబుతున్నాడట. మరి నిజంగానే శంకర్ భారీ తనానికి కోట్లలో ఖర్చు పెట్టే నిర్మాతలైతే ఓకె.. లేదంటే ఇక అంతే. ఇప్పుడు కరోనా టైం లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టే నిర్మాత అయినా కింద మీద పడాల్సి వస్తుంది.