గత ఏడాది డిసెంబర్ లో హీరో శర్వానంద్ ఇద్దరు దర్శకులను లైన్ లో పెట్టి ఒకేసారి రెండు ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నాడు... ఎన్నడూ లేనిది శర్వా ఇలా ఒకేసారి రెండు సినిమాలను ఎలా మేనేజ్ చేస్తాడో.. అసలెప్పుడు తొందరగా సినిమాలు చెయ్యని శర్వానంద్ రెండు సినిమాల షూటింగ్స్ లో బాగా బిజీగా మారుతున్నాడు అన్నారు. హను రాఘవపూడితో పడి పడి లేచే మనసు, సుధీర్ వర్మ సినిమాలని ఏకకాలంలో పూర్తి చేస్తాడన్నారు. కానీ శర్వా మాత్రం ఎప్పటిలాగే కూల్ గా హను రాఘవపూడి పడి పడి లేచే మనసు పూర్తి చేసేసాడు. ఇక సుధీర్ వర్మ సినిమా మాత్రం కాస్త ఆలస్యంగా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లగా.. షూటింగ్ బాగా ఆలస్యమవుతూ వచ్చింది. ఒకానొక సమయంలో సుధీర్ వర్మ - శర్వా సినిమా ఆగిపోయిందనే న్యూస్ కూడా వచ్చింది. తాజాగా ఫస్ట్ లుక్ రెడీ కానీ.. టైటిల్ దొరకడం లేదంటున్నారు.
నిజ జీవిత ఘటనల ఆధారంగా...
సుధీర వర్మ, శర్వా సినిమా స్క్రిప్ట్ మీదే చాలా రోజులు కూర్చున్నాడు. అయితే వీరి కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా 1990 ప్రాంతంలో వైజాగ్ లో జరిగిన కొన్ని నిజ జీవిత ఘటనల ఆధారంగా ఉండబోతుందట. కథ ప్రకారం ఈ సినిమాలో శర్వానంద్ గ్యాంగ్ స్టార్ గా కనిపిస్తాడట. మరి కథకు తగ్గట్టే టైటిల్ కూడా విరాటపర్వం అని అనుకున్నారు. అయితే టైటిల్ అంతా ఓకె అనుకున్నాకే ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ రివీల్ ఉంటుందట. మరి కాస్త లేట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ లో ప్లాన్ చేస్తున్నట్లుగా శర్వానంద్ చెబుతున్నాడు.