పనిని ప్రేమిస్తే సంతోషమే కదా?

ప్రస్తుతం లాక్ డౌ తో షూటింగ్స్ కి వెళ్లలేకపోతున్నామని చాలామంది హీరోయిన్స్ తెగ బాధపడిపోతున్నాడు. లాక్ డౌన్ ఎప్పుడు ముగుస్తుందో… ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకెళతామో అంటూ ఎదురు [more]

Update: 2020-05-22 04:08 GMT

ప్రస్తుతం లాక్ డౌ తో షూటింగ్స్ కి వెళ్లలేకపోతున్నామని చాలామంది హీరోయిన్స్ తెగ బాధపడిపోతున్నాడు. లాక్ డౌన్ ఎప్పుడు ముగుస్తుందో… ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకెళతామో అంటూ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేని అనుపమ పరమేశ్వరన్ కూడా లాక్ డౌన్ ఎప్పుడు ముగుస్తోందా? ఎప్పుడు సెట్స్ మీదకెళ్తామా అని ఎదురు చూస్తుందట. తాజాగా  అనుపమ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. మీరెప్పుడు సంతోషంగా కనబడతారు అదెలా సాధ్యం అని అడగగా..

దానికి అనుపమ నవ్వుతూ.. నేను నా పనిని ప్రేమిస్తాను…. అందుకే ఎల్లప్పుడూ సంతోషంగా కనబడతాను అంటుంది. చిన్నప్పటినుండి నటిగా మారాలని అనుకున్నాను.. ఇప్పుడు హీరోయిన్ అయ్యాను. అందుకే చాలా సంతోషంగా ఉన్నాను. ఇక సెట్స్ లో ఉన్నప్పుడు ఓ సీన్ షూట్ పర్తవ్వగానే అది మనమనుకున్న దానికన్నా బాగా వస్తే ఆ సంతోషం మన మొహం లోనే కనబడుతుంది. అసలు మీరు నమ్ముతారో లేదో… నేను నా పని తో సంతృప్తిగా ఉన్న రోజు నాకు రాత్రి పూట నిద్ర కూడా పట్టదు అని చెబుతుంది ఈ అందాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్.

Tags:    

Similar News