ఆ హీరోయిన్ భర్త అలా రావడంతో.. ట్రోల్స్..!
మీడియాను తప్పించుకుని లోపలికి వెళ్ళాడు.
శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల కేసులో అరెస్టయినప్పటి నుంచి నెటిజన్లు ఆయన్ను టార్గెట్ చేసి.. విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. రాజ్ కుంద్రా సాధారణంగా బహిరంగ ప్రదేశాలలో మాస్క్‌లు లేదా ఫేస్ కవర్‌లను ధరించి కనిపిస్తారు. ఫోటోగ్రాఫర్స్ నుండి తప్పించుకోడానికి రాజ్ ఇలా చేస్తూ ఉంటారని అంటుంటారు. ఇటీవల శిల్పా, రాజ్ ఓ రెస్టారెంట్‌కి డిన్నర్‌కి వచ్చారు. జంట కారు దిగగానే, ఫోటోగ్రాఫర్స్ రాజ్‌ని తమ కెమెరాల్లో బంధించడానికి ప్రయత్నించారు. కుంద్రా నల్లని జాకెట్, నల్లటి ఫేస్ మాస్క్ ధరించి కనిపించారు. మీడియాను తప్పించుకుని లోపలికి వెళ్ళాడు. శిల్పా మాత్రం ఫోటోలకు పోజులిచ్చింది.
ఈ వీడియో కనిపించిన వెంటనే నెటిజన్లు సోషల్ మీడియాలో సందడి చేయడం మొదలుపెట్టారు. సోషల్ మీడియా వినియోగదారుల్లో పలువురు రాజ్ కనీసం మీడియాకు ముఖం చూపించాలని అనుకోవడం లేదని అన్నారు. జూన్ నెలలో వ్యాపారవేత్త రాజ్ కుంద్రా తన భార్య, నటి శిల్పాశెట్టి కుంద్రా 47వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు ఒక సంవత్సరం తర్వాత ట్విట్టర్‌కి తిరిగి వచ్చారు. ట్విటర్‌లో రాజ్ తన భార్య శిల్పకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకొచ్చాడు.
2021 జూలైలో అశ్లీల వీడియోలను రూపొందించాడనే ఆరోపణలతో రాజ్‌ని అరెస్టు చేశారు. సెప్టెంబర్‌లో బెయిల్ మంజూరు చేయబడింది. అతనిపై భారతీయ శిక్షాస్మృతి, మహిళల అసభ్య ప్రాతినిధ్యం (నివారణ) చట్టం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.