రాజశేఖర్ కూతురి పరిస్థితి ఇలా అయ్యిందేంటి..?

బాలీవుడ్ లో అర్జున్ కపూర్, అలియా భట్ హీరో హీరోయిన్ గా నటించిన ‘2 స్టేట్స్’ సినిమా ప్రముఖ రచయిత చేతన్ భగత్ రచించిన నవల ఆధారంగా [more]

Update: 2019-03-30 06:20 GMT

బాలీవుడ్ లో అర్జున్ కపూర్, అలియా భట్ హీరో హీరోయిన్ గా నటించిన ‘2 స్టేట్స్’ సినిమా ప్రముఖ రచయిత చేతన్ భగత్ రచించిన నవల ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అక్కడ ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే ఇప్పుడు అదే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అడివి శేష్ హీరోగా.. సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్ హీరోయిన్ గా ఈ సినిమా స్టార్ట్ అయింది. కొంత భాగం షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. కొత్త డైరెక్టర్ వెంకట్ కుంచం దర్శకత్వం రూపొందిస్తున్న ఈ సినిమాకు ఊహించని అడ్డంకులు ఏర్పడ్డాయి. సినిమాను సడెన్ గా ఆపేసారు.

కొత్త దర్శకుడితో…

ఈ చిత్ర నిర్మాతలు సినిమా అవుట్ పుట్ తో సంతృప్తి చెందలేదట. అందుకే ఇప్పటివరకు తీసినది మొత్తం ఆపేసి మరో కొత్త దర్శకుడితో షూటింగ్ మళ్లీ మొదలు పెట్టాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. మరి ఆ కొత్త దర్శకుడు ఎవరో తెలియాల్సి ఉంది. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి. పాపం రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్ ఇండస్ట్రీకి పరిచయం అయిన తొలి సినిమానే ఆగిపోయింది.

Tags:    

Similar News