సౌత్ అంటే భయపడుతున్న బాలీవుడ్ భామ?

కొంతమంది బాలీవుడ్ భామలు సౌత్ సినిమాల్లో నటించాలంటే చాలా ఆలోచిస్తారు. బాలీవుడ్ అయితే భయముండదు. క్రేజుకి క్రేజు, డబ్బుకి డబ్బు. అదే సౌత్ హీరోయిన్స్ కి బాలీవడ్ [more]

Update: 2020-03-05 13:24 GMT

కొంతమంది బాలీవుడ్ భామలు సౌత్ సినిమాల్లో నటించాలంటే చాలా ఆలోచిస్తారు. బాలీవుడ్ అయితే భయముండదు. క్రేజుకి క్రేజు, డబ్బుకి డబ్బు. అదే సౌత్ హీరోయిన్స్ కి బాలీవడ్ ఛాన్స్ వస్తే ఎగిరి గంతేస్తారు. అక్కడ క్రేజ్ అలాంటిది. అయితే చాలామంది బాలీవుడ్ హీరోయిన్స్ ఒకటి రెండు సౌత్ సినిమాలు చేసినా మళ్ళీ మరో సినిమాలో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపిన దాఖలాలు లేవు. టబు లాంటివాళ్లు సౌత్ లో భారీ హిట్స్ కొట్టబట్టి.. ఇక్కడ చాలా సినిమాలు చేసారు కానీ.. ప్రీతి జింటా, రవీనా టాండన్,కత్రినా కైఫ్ లాంటోళ్ళు ఒకటి రెండు సినిమాలకే జెండా పీకేసారు. తాజాగా మరో బాలీవుడ్ బ్యూటీ నటించిన ఒకే ఒక సౌత్ సినిమాతోనే మల్లి సౌత్ లో నటించాలంటే భయపడుతుంది.

ఆమె ఎవరో కాదు సాహో బ్యూటీ. ప్రభాస్ తో సహా సినిమాలో నటించిన శ్రద్ద కపూర్.. మరో సౌత్ సినిమా అంటే జడుసుకుంటుంది. ప్రభాస్ ది బాహుబలి క్రేజ్ కదా.. నాకు మంచి క్రేజ్ వస్తుంది అనుకుంది శ్రద్ద కపూర్. సాహో సౌత్ లో అట్టర్ ప్లాప్ కాగా.. బాలీవుడ్ లో హిట్ అయ్యింది. అయితే ఈ సినిమాలో శ్రద్ద కపూర్ ని హీరోయిన్ అనుకున్నప్పుడు చాలామంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసారు. గ్లామర్ లెస్ గర్ల్ ప్రభాస్ పక్కన ఏం పనికొస్తుంది అని. కానీ సినిమాలో ఆమె కేరెక్టర్ కి ఆమె సూట్ అయ్యింది. అయితే ఆ సినిమా ప్లాప్ ఆడంతో శ్రద్ధ కపూర్ మరో తెలుగు సినిమా అంటేనే ఇప్పుడు అస్సలు ఇంట్రెస్ట్ చూపడం లేదు. తెలుగు, తమిళం నుంచి భారీ ఆఫర్స్ వెళ్లినప్పటికీ ఆమె సున్నితంగా తిరస్కరిస్తోందని టాక్ అయితే ఉంది కానీ.. సాహో లో ఆమెని చూసాక మరో సౌత్ డైరెక్టర్ ఎవరూ ఆమెని సంప్రదిస్తారని అనుకోవడం లేదు. కానీ శ్రద్ద కపూర్ మాత్రం సౌత్ సినెమాలనంటే నై నై అంటుందట.

Tags:    

Similar News