బిగ్ బాస్ పై అది ఫేక్ న్యూస్

నన్ను సంప్రదించకుండా ఈ న్యూస్ ఎలా రాస్తారు…. ఈమాటన్నది ఎవరో కాదు… టాలీవుడ్ హాటెస్ట్ హీరోయిన్ శ్రద్ద దాస్. శ్రద్ద దాస్ టాలీవుడ్ లో ఫెడవుట్ అయిన [more]

Update: 2019-09-07 07:31 GMT

నన్ను సంప్రదించకుండా ఈ న్యూస్ ఎలా రాస్తారు…. ఈమాటన్నది ఎవరో కాదు… టాలీవుడ్ హాటెస్ట్ హీరోయిన్ శ్రద్ద దాస్. శ్రద్ద దాస్ టాలీవుడ్ లో ఫెడవుట్ అయిన హీరోయిన్. తెలుగు, తమిళ, మలయాళంలో వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటున్న శ్రద్ద దాస్ పేరు ఈ మధ్యన టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వినబడుతుంది. ఎందుకంటే బుల్లితెర మీద ప్రస్తుతం ప్రసారమవుతున్న బిగ్ బాస్ 3 లో శ్రద్ద దాస్ హాట్ గా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతుందని..ప్రచారం మాములుగా జరగడం లేదు. శ్రద్ద దాస్ తో పాటుగా హెబ్బా పటేల్, ఈషా రెబ్బ పేర్లు వినబడ్డాయి.

బిగ్ బాస్ కు నేనెందుకు రానంటే….

ఇక తాజాగా శ్రద్ద దాస్ బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వాల్సింది కానీ.. వరుణ్ సందేశ్ వల్ల వెళ్లలేదన్నారు. కారణం వరుణ్ కి శ్రద్ద కి లవ్ ఎఫ్ఫైర్ రూమర్స్ ఉన్నాయి. అయితే ఈ వార్తలన్నిటి మీద శ్రద్ద దాస్ ఫైర్ అవుతుంది. ఇలాంటి వార్తలు రాసేముందు.. తనని సంప్రదిస్తే బావుండేదని.. అసలు ఏ విషయంలోనైనా నా కంఫర్ట్, ఇష్టం, పాజిబిలిటీ వంటి అన్ని విషయాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని.. ప్రస్తుతం తాను ఐదు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా వున్నాని చెబుతుంది. అంత బిజీగా ఉన్న నేను బిగ్ బాస్ లోకి ఎలా వెళ్తానంటూ ఎదురు ప్రశ్నిస్తుంది.

 

 

 

Tags:    

Similar News