బాలీవుడ్ "పుష్ప" కి డబ్బింగ్ చెప్తున్న క్రేజీ హీరో
బాలీవుడ్ లో విడుదలవుతున్న పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కు డబ్బింగ్ ను శ్రేయస్ తల్పడే చెబుతున్నారు
అల్లు అర్జున్ - సుకుమార్ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పుష్ప - ది రైజ్. ఈ సినిమా ఈనెల 17వ తేదీన తెలుగుతో పాటు పలు భాషల్లో థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఈ నెల 12వ తేదీన ప్రీ రిలీజ్ వేడుకను జరుపుకునేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఈ ఈవెంట్ కు ప్రభాస్ ఒక గెస్ట్ అయితే.. చిరంజీవి లేదా బాలకృష్ణ ల్లో ఎవరో ఒకరు స్పెషల్ గెస్ట్ గా రానున్నట్లు తెలుస్తోంది. బన్నీ ఈ సినిమాతో తొలిసారిగా బాలీవుడ్ మార్కెట్ ను కొల్లగొట్టేందుకు చూస్తున్నాడు. హిందీ లో ఈ సినిమాను ఏఏ సినిమాస్ సంస్థ విడుదల చేస్తోంది. ఇటీవలే విడుదలైన పుష్ప ట్రైలర్ బాలీవుడ్ లోనూ ప్రకంపనలు సృష్టించింది. అక్కడ బన్నీకి డబ్బింగ్ ఒక క్రేజీ హీరో డబ్బింగ్ చెప్తున్నాడట. ఇంతకీ ఎవరు అతను అనుకుంటున్నారా ? అతనే శ్రేయస్ తల్పడే.
అదే ప్లస్ పాయింట్...
రెగ్యులర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ తో కాకుండా.. పేరున్న వ్యక్తితో పుష్ప కు డబ్బింగ్ చెప్పిస్తుండటం ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. పుష్ప ట్రైలర్ లాంచ్ సందర్భంగా శ్రేయస్ తల్పడే ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇండియాలోనే మోస్ట్ పవర్ ఫుల్ అండ్ స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ గా పేరొందిన అల్లు అర్జున్ కు తాను డబ్బింగ్ చెప్పినందుకు చాలా గర్వంగా ఉందన్నారు శ్రేయస్. విశేషం ఏంటంటే శ్రేయస్ డబ్బింగ్ చెప్తోన్న మొదటి తెలుగు సినిమా ఇదే. మరి బాలీవుడ్ జనాలు పుష్ప ను ఆదరిస్తారో లేదో తెలియాలంటే డిసెంబర్ 17 వరకూ ఆగాల్సిందే.