శింబుతో త్రిష పెళ్లా..?
సీనియర్ హీరోయిన్ త్రిష పెళ్లి విషయం ఎప్పుడూ సోషల్ మీడియాలో హైలెట్టే. గతంలో త్రిష చెన్నై కి చెందిన ఓ వ్యాపారా వేత్తతో ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్ళికి [more]
సీనియర్ హీరోయిన్ త్రిష పెళ్లి విషయం ఎప్పుడూ సోషల్ మీడియాలో హైలెట్టే. గతంలో త్రిష చెన్నై కి చెందిన ఓ వ్యాపారా వేత్తతో ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్ళికి [more]
సీనియర్ హీరోయిన్ త్రిష పెళ్లి విషయం ఎప్పుడూ సోషల్ మీడియాలో హైలెట్టే. గతంలో త్రిష చెన్నై కి చెందిన ఓ వ్యాపారా వేత్తతో ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్ళికి రెడీ అయ్యాక.. ఏమైందో ఏమో పెళ్లి క్యాన్సిల్ చేసింది. కెరీర్ ఊగిసలాటలో ఉన్నప్పుడు జరిగిన ఆ ఘటనతో త్రిష కాస్త కామ్ అయినా… మళ్ళీ కెరీర్లో ఫామ్ లోకొచ్చేసింది. త్రిష ఇప్పుడు చేతినిండా సినిమాల్తో యమా బిజీగా ఉన్న హీరోయిన్. యంగ్ హీరోయిన్స్ చేతిలోకూడా లేని సినిమా అవకాశాలతో త్రిష బిజీ బిజీ. అయితే తాజాగా త్రిష పెళ్లి న్యూస్ మరోమారు సోషల్ మీడియాకెక్కింది. ఆమధ్యన త్రిష పెళ్లి విషయం ప్రచారం జరగగా..నా పెళ్లి ఎపుడో నాకేతెలియదు.. ఒకవేళ తెలిస్తే మీకు చెప్పకుండా చేసుకోను అని చెప్పింది.
తాజాగా త్రిష తమిళ హీరో శింబుని వివాహమాడనున్నట్లుగా కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్. శింబు – త్రిష పెళ్ళికి పెద్దలు కూడా ఒప్పుకున్నారని, త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కబోతున్నట్టుగా టాక్. గతంలో శింబు హన్సిక, నయనతార లతో ప్రేమ, పెళ్లి అంటూ ప్రేమాయణం నడిపినా.. వాళ్లతో బ్రేకప్ అయ్యాక శింబు సినిమాలు చేసుకుంటున్నాడు. ఈమధ్యన శింబు వివాహంపై కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరగగా.. శింబు తండ్రి రాజేంద్ర శింబు పెళ్లి విషయమై స్పందించాడు. ఇంకా కుదుర లేదని.. సంబంధాలు చూస్తున్నామని చెప్పాడు. ఇప్పుడు త్రిషతో శింబు పెళ్లి అంటున్నారు. అందులో నిజమెంతుందో త్రిష స్పందిస్తేనే కానీ క్లారిటీ రాదు.