సింగర్ సునీత పెళ్లి ఎప్పుడంటే

సింగర్ సునీత రెండో పెళ్లి విషయం గత కొంతకాలంగా మీడియాలో చక్కర్లు కొడుతున్న టైం లో సునీత తనకు కాబోయే వరుడిని పరిచయం చెయ్యడం చెయ్యడమే.. నిశ్చితార్ధం [more]

Update: 2020-12-26 15:47 GMT

సింగర్ సునీత రెండో పెళ్లి విషయం గత కొంతకాలంగా మీడియాలో చక్కర్లు కొడుతున్న టైం లో సునీత తనకు కాబోయే వరుడిని పరిచయం చెయ్యడం చెయ్యడమే.. నిశ్చితార్ధం చేసుకుని మరీ పరిచయం చేసింది. మ్యాంగో యూట్యూబ్ అధినేత రామ్ ని సునీత రెండో వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. అయితే మీడియాలో వచ్చిన వార్తలను బట్టి సునీత పెళ్లి ఈ రోజో రేపో అంటే డిసెంబర్ 26 లేదా 27 తేదీల్లో జరగబోతుంది అంటూ ప్రచారం జరిగినా సునీత నా పెళ్లి డేట్ చెప్పేవరకు ఆగండి అంది.. అలాగే సునీత ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ కూడా సోషల్ మీడియాలో బాగా హైలెట్ అయ్యాయి.

అయితే తాజాగా సునీత పెళ్లి డేట్ బయటికి వచ్చింది. సింగర్ సునీత – రామ్ ల రెండో వివాహానికి తేదీ ఫిక్స్ అయ్యింది. 2021 జనవరి 9 న సునీత పెళ్లి కూతురుగా ముస్తాబు కాబోతుంది. సునీత – రామ్ ల వివాహం కొద్దిమంది సన్నహితుల మధ్యనే సింపుల్ గా జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈరోజు శనివారం సునీత ఇండస్ట్రీలోని సన్నిహితులకి ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇవ్వబోతున్నట్టుగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి సునీత ప్రీ వెడ్డింగ్ పార్టీలో ఇండస్ట్రీలోని చాలామంది ప్రముఖులు హాజరవుతారనే టాక్ ఉంది

Tags:    

Similar News