ఇప్పుడుంతా ఎస్.జె.సూర్య గురించే చర్చ

ఎస్.జె.సూర్య. ఈ పేరు వింటే వెంటనే మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ మూవీ గుర్తొస్తుంది. ఇటువంటి సినిమాను డైరెక్ట్ చేసిన ఈయన గత కొంతకాలం [more]

;

Update: 2019-05-20 07:30 GMT
s.j.surya acting in monster
  • whatsapp icon

ఎస్.జె.సూర్య. ఈ పేరు వింటే వెంటనే మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ మూవీ గుర్తొస్తుంది. ఇటువంటి సినిమాను డైరెక్ట్ చేసిన ఈయన గత కొంతకాలం నుండి నటుడిగా మంచి పాత్రలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. తెలుగులో స్పైడర్ సినిమాలో నెగటివ్ రోల్ చేసి క్రిటిక్స్ సైతం మెచ్చుకునేలా చేసుకున్నాడు సూర్య. ప్రస్తుతం వరుస సినిమాలతో నటుడిగా కొనసాగుతున్న ఈయన ‘మాంస్టర్’ అనే తమిళ సినిమాలో లీడ్ రోల్ చేశాడు. ఈ మూవీ గత శుక్రవారం రిలీజ్ అయింది. ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సూర్య మధ్యతరగతి వ్యక్తిగా ఒక ఎలుక వల్ల కష్టాలు పడే పాత్రలో నటించాడు.

చర్చంతా ఆయన నటన గురించే

సినిమాలో సూర్య నటనకు క్రిటిక్స్ కూడా జేజేలు పలుకుతున్నారట. ప్రస్తుతం అతని నటన గురించే కోలీవుడ్ లో చర్చలు జరుగుతున్నాయి అంటే అతని పాత్ర ఎంతలా ఆకట్టుకుంటుందో వేరే చెప్పనవసరం లేదు. ఈ మూవీ తనకు మరపురాని చిత్రమని ఆయన అంటున్నారు. సినిమాకు ప్రేక్షకుల నుండి ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రస్తుతం సూర్య కోలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావడంతో అతని చేతిలో ప్రస్తుతం అర డజనుకు పైగా ప్రాజెక్టులు ఉన్నాయట.

Tags:    

Similar News