Meera Chopra : ప్రేమ పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్..
ప్రేమ పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్ బంగారం మూవీ హీరోయిన్.;
Meera Chopra : పవన్ కళ్యాణ్ 'బంగారం' సినిమాలో నటించిన హీరోయిన్ మీరా చోప్రా.. ప్రేమ పెళ్లితో మ్యారేజ్ లైఫ్ ని స్టార్ట్ చేసారు. ప్రియాంక చోప్రా కజిన్ అయిన మీరా చోప్రా తమిళ చిత్రంతో యాక్టింగ్ కెరీర్ ని స్టార్ట్ చేసారు. ఆ తరువాత రెండో చిత్రంగా పవన్ తో బంగారంలో నటించి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. తమిళంలో ఎక్కువ సినిమాలు చేసిన ఈ హీరోయిన్.. తెలుగులో వాన, మారో, గ్రీకువీరుడు సినిమాలు మాత్రమే చేసారు.
ఇక ముంబైకి చెందిన ఈ భామ.. అక్కడి వ్యాపారవేత్త రక్షిత్ కేజ్రీవాల్ తో గత మూడేళ్ళుగా ప్రేమని నడుపుతూ వచ్చారు. ఆ ప్రేమ లైఫ్ ని ఇప్పుడు ఇంకొంచెం ముందుకు తీసుకు వెళ్తూ ఏడడుగులు వేశారు. ఈ వివాహం జైపూర్ లోని రిసార్ట్స్ లో గ్రాండ్ గా జరిగింది. మార్చి 11, 12 డేట్స్ లో రెండు రోజుల పాటు జరిగిన ఈ వివాహానికి కేవలం ఇరు కుటుంబసభ్యులు, అత్యంత బంధుమిత్రుల మాత్రమే హాజరయ్యారు.
తాజాగా ఈ పెళ్లి ఫోటోలను మీరా చోప్రా తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. సంతోషం, గొడవలు, నవ్వులు, కన్నీళ్లు, జీవితాంతం సరిపోయే జ్ఞాపకాలు అంటూ మీరా చోప్రా రాసుకొస్తూ పెళ్లి ఫోటోలను షేర్ చేసారు. ఇక ఈ పోస్టు సినిమా ఆడియన్స్ కంగ్రాట్యులేషన్స్ తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.