మరోసారి ఆస్పత్రిలో చేరిన కమల్ ?

సౌత్ సూపర్ స్టార్ కమల్ హాసన్ మరోసారి ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. గతేడాది;

Update: 2022-01-17 10:03 GMT
మరోసారి ఆస్పత్రిలో చేరిన కమల్ ?
  • whatsapp icon

సౌత్ సూపర్ స్టార్ కమల్ హాసన్ మరోసారి ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. గతేడాది నవంబర్ లో యూఎస్ నుంచి తిరిగొచ్చిన వెంటనే ఆయనకు కోవిడ్ పాజిటివ్ గా తేలింది. దాంతో 10 రోజులకు పైగానే ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. కోవిడ్ నుంచి కోలుకోగానే.. తమిళ బిగ్ బాస్ సీజన్ లో హోస్ట్ గా కనిపించారు కమల్. తాజాగా ఆయన మరోసారి ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. దీంతో కమల్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Also Read : 
శ్రీరెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన దీప్తి సునయన..
కమల్ రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. చెకప్ అనంతరం తిరిగి ఇంటికెళ్లనున్నారు. అయితే.. ఈ విషయంపై కమల్ వర్గం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ.. సోషల్ మీడియాలో కమల్ ఆస్పత్రిలో చేరారంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కమల్ హాసన్ విక్రమ్, ఇండియన్ 2 సినిమాలు చేస్తున్నారు.



Tags:    

Similar News