శ్రీను వైట్లకి హీరో దొరికాడుగా..!

వరుస సినిమాలు డిజాస్టర్స్ అవడంతో దర్శకుడు శ్రీని వైట్ల పనైపోయిందని అంటున్నారు. ఏదో ఒక సినిమా తనని నిలబెట్టలేకపోతుందా అని శ్రీను వైట్ల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. [more]

Update: 2019-04-04 06:28 GMT

వరుస సినిమాలు డిజాస్టర్స్ అవడంతో దర్శకుడు శ్రీని వైట్ల పనైపోయిందని అంటున్నారు. ఏదో ఒక సినిమా తనని నిలబెట్టలేకపోతుందా అని శ్రీను వైట్ల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఆగడు, బ్రుస్ లీ, మిస్టర్ సినిమాలతో ఫ్లాప్ ఇచ్చిన శ్రీను వైట్లని నమ్మి రవితేజ అమర్ అక్బర్ ఆంటోని సినిమా చేస్తే.. ఆ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇక శ్రీనుకి మరో హీరో ఛాన్స్ ఇస్తాడా అంటూ సోషల్ మీడియాలో చాలానే వార్తలు ప్రచారంలోకొచ్చాయి. కానీ ఇప్పుడు శ్రీను వైట్లకి ఒక ఫ్లాప్ హీరో ఛాన్స్ ఇచ్చాడు. అది కూడా తనకి ఢీ సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన మంచు విష్ణు.

12 ఏళ్ల తర్వాత మళ్లీ హిట్ కాంబో

12 ఏళ్ల క్రితం మంచు విష్ణు – శ్రీను వైట్ల కాంబోలో తెరకెక్కిన ఢీ సినిమా కామెడీ హిట్ అయ్యింది. అయితే ప్రస్తుతం విష్ణు కూడా హిట్ లేకుండా ఫ్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్నాడు. మరి మళ్లీ ఇన్నాళ్లకి శ్రీను వైట్లతో విష్ణు అంటే ఆ సినిమా మీద మార్కెట్ లో ఎలాంటి అంచనాలుంటాయో తెలియదు కానీ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతూ 12 ఏళ్ల తరువాత తాను శ్రీను వైట్లతో సినిమా చేయనున్నానని అన్నాడు. విష్ణు నటించిన ఓటర్ సినిమా మరికొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఫ్లాప్ దర్శకుడు, ప్లాప్ హీరో కలిసి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూద్దాం.

Tags:    

Similar News