లేట్ గానే వస్తాం అంటున్న స్టార్ హీరోస్

వచ్చే సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు తలబడనున్నాయి. ఒకటి మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ ఇంకోటి అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి [more]

Update: 2019-10-24 08:58 GMT

వచ్చే సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు తలబడనున్నాయి. ఒకటి మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ ఇంకోటి అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ‘అల వైకుంఠపురములో’ టీం అల్లు అర్జున్ ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగల్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ లో మహేష్ సినిమా కంటే ముందు ఉన్నారు. రీసెంట్ గా రెండో సింగల్ ప్రోమో ని రిలీజ్ చేశారు. త్వరలోనే సెకండ్ సింగల్ ఫుల్ వీడియో ని రిలీజ్ చేయనున్నారు. త్రివిక్రమ్ బర్త్ డే సందర్భంగా నవంబర్ 7న సినిమా టీజర్ విడుదల చేస్తే ఎలా వుంటుందన్న ఆలోచనలు సాగుతున్నాయి.

ఏం చేద్దాం…..

మరీ అంత ఎర్లీ గా టీజర్ ను రిలీజ్ చేద్దామా? లేదా డిసెంబర్ లో రిలీజ్ చేద్దామా అన్న ఆలోచనలు సాగుతున్నట్లు బోగట్టా. ఇప్పటికే చాలా చేశాం. కొంచెం లేట్ గా ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తే బెటర్ అన్న ఆలోచనలో ఉన్నారు ‘అల వైకుంఠపురములో’ టీం. మరీ ఏం చేస్తారో చూడాలి. ఇక పండగకు వస్తున్న మరో సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’.

దీపావళితో మెల్లిగా……

సినిమా స్టార్ట్ అయిన దగ్గరి నుంచి ఏదొక ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు టీం. అనిల్ రావిపూడి ఎప్పటికప్పుడు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు. అందుకే ప్రచారం విషయంలో తొందరపడడం లేదు. డిసెంబర్ వరకు పాటలు, టీజర్లు ఇలాంటివి ఏవీ వదిలే ఆలోచన చేయడం లేదు. దీపావళి కి ఒక పోస్టర్ తో సరిపెట్టాలని చూస్తున్నారు. ఆ రోజు విజయశాంతి, మహేష్ బాబుల పోస్టర్లు వస్తాయి. డిసెంబర్ లో ప్రమోషన్స్ స్టార్ట్ చేద్దాం అన్న ఆలోచనలో ఉన్నారు అనిల్ టీం.

 

Tags:    

Similar News