స్టైలిష్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అవ్వబోతున్నాడు..!

హరీష్ శంకర్ చాలా గ్యాప్ తరువాత వరుణ్ తేజ్ తో ఓ తమిళ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. “వాల్మీకి” పేరుతో వస్తున్న ఈ సినిమాను హరీష్ [more]

Update: 2019-02-14 06:02 GMT

హరీష్ శంకర్ చాలా గ్యాప్ తరువాత వరుణ్ తేజ్ తో ఓ తమిళ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. “వాల్మీకి” పేరుతో వస్తున్న ఈ సినిమాను హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే హరీష్ కు ఎప్పటి నుండో చిన్న సినిమాలని ప్రొడ్యూస్ చేయాలని ఓ కోరిక ఉండేది. హరీష్ శంకర్ త్వరలోనే ప్రొడ్యూసర్ అవతారం ఎత్తాలని చూస్తున్నా తనకి ఉన్న కమిట్ మెంట్స్ వల్ల అది కుదరడం లేదట. అయితే చివరికి కుదిరింది.

త్వరలోనే సినిమా…

ప్రస్తుతం అతని నిర్మాణ బాధ్యతలు ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పై సినిమాలు నిర్మిస్తున్న మహేష్ ఎస్ కోనేరు చూసుకుంటున్నాడు. త్వరలోనే తన బ్యానర్ పేరు ప్రకటించనున్నాడు. తను ప్రొడ్యూస్ చేయబోయే సినిమాకి తనే రచన సహకారం అందిస్తాడట. ఈ మధ్య డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ మారడం ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు ఆ జబితాలో హరీష్ చేరాడు.

Tags:    

Similar News