సుధీర్ కనీసం ఫ్రెండ్ కూడా కాదు?

సుడిగాలి సుధీర్ – రష్మీ గౌతమ్ లు మంచి ఫ్రెండ్స్. ఆన్ స్క్రీన్ లో లవర్స్. మంచి మసాలా  జోడి. ఇద్దరూ ఢీ డాన్స్ షోలోను, జబర్దస్త్ [more]

Update: 2020-05-08 04:54 GMT

సుడిగాలి సుధీర్ – రష్మీ గౌతమ్ లు మంచి ఫ్రెండ్స్. ఆన్ స్క్రీన్ లో లవర్స్. మంచి మసాలా  జోడి. ఇద్దరూ ఢీ డాన్స్ షోలోను, జబర్దస్త్ స్టేజ్ మీదను సుడిగాలి సుధీర్ – రష్మీ ల మీద పడే పంచ్ లు వాళ్ళు చేసే లవ్లీ యాక్షన్ తో నిజంగానే వాళ్ళు ఇద్దరూ లవర్స్ ఏమో.. పెళ్లి కూడా చేసుకుంటారేమో అనుకుంటారు. కానీ సుధీర్ – రష్మీ మాత్రం మేము ఫ్రెండ్స్ మాత్రమే.. లవర్స్ కాదు అంటారు. ఎక్కువగా ఈ విషయంలో రష్మీ ఇచ్చిన క్లారిటీ సుధీర్ ఇవ్వడు. ఆన్ స్క్రీన్ లవర్స్ గా ఈ ఇద్దరితో ఈటివి కి మంచి క్రేజ్ వచ్చింది.

అయితే తాజాగా రష్మీ గౌతమ్ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను సుడిగాలి సుధీర్ ఆన్ స్క్రీన్ మీద మంచి నటులమే కానీ… బయట కనీసం ఫ్రెండ్స్ కుడా కాదు. షూటింగ్ అయిపోగానే.. బయట ఎవరికీ వారమే పరిచయస్తుల్లా ఉంటాము. టివిలో స్క్రిప్ట్ కి తగ్గట్టుగా నటిస్తాము అంతే. ఇక గుంటూరు టాకీస్ చేసి తప్పుచేసాను. అప్పటినుండి నాకు బోల్డ్ కేరెక్టర్స్ మాత్రమే వస్తున్నాయి. ఇక నేను అనసూయ బుల్లితెర మీద గ్లామర్ చూపించి కొత్త ట్రెండ్ సెట్ చేసాము. ఇక ప్రస్తుతం పలు టివి షోస్ చేసున్న నెను త్వరలోనే ఓటిటి ప్లేట్  ఫామ్ లో అడుగుపెడుతున్నట్లుగా చెప్పింది రష్మీ గౌతమ్.

Tags:    

Similar News