మాస్టర్ కి దిమ్మ తిరిగే ఆఫర్… అయినా నో?
ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ తో థియేటర్స్ మూత పడ్డాయి. కేంద్రం సెప్టెంబర్ నెలాఖరు వరకు థియేటర్స్ బంద్ కొనసాగించాలంటూ ప్రకటన జారీ చేసింది. దానితో ఇంతకుముందు [more]
ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ తో థియేటర్స్ మూత పడ్డాయి. కేంద్రం సెప్టెంబర్ నెలాఖరు వరకు థియేటర్స్ బంద్ కొనసాగించాలంటూ ప్రకటన జారీ చేసింది. దానితో ఇంతకుముందు [more]
ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ తో థియేటర్స్ మూత పడ్డాయి. కేంద్రం సెప్టెంబర్ నెలాఖరు వరకు థియేటర్స్ బంద్ కొనసాగించాలంటూ ప్రకటన జారీ చేసింది. దానితో ఇంతకుముందు ఒప్పుకోని సినిమాలు ఇప్పుడు చేసేది లేక ఓటిటి దారి పడుతున్నాయి. అయితే షూటింగ్ కంప్లీట్ అయ్యి.. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని మరో 20 రోజుల్లో విడుదల అనగా కరోనా మహమ్మారి రావడంతో విజయ్ మాస్టర్ సినిమా వాయిదా పడింది. అప్పటినుండి మాస్టర్ సినిమా కోసం ఓటిటి వారు చాల ప్లాన్స్ వేస్తున్నారు కానీ దర్శకనిర్మాతలు వంగడం లేదు.
అయితే ఇప్పటికే తమిళనాట ఓటిటీలకు అమ్ముతున్న హీరోలపై అక్కడ థియేటర్స్ మండలి ఆగ్రహంగా ఉంది. సూర్య ఆకాశమే హద్దురా సినిమాని ఓటిటికి అమ్మేశాక సూర్య మీద తమిళ థియేటర్స్ సంఘం కత్తి కట్టింది. ఇకపై సూర్య సినిమాలు థియేటర్స్ లో ఎలా విడుదల అవుతాయో చూస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. మరోపక్క ధనుష్ సినిమా ఓటిటిలో విడుదల అంటూ ప్రచారం జరగడంతో ధనుష్ ఫాన్స్ గత రాత్రి నుండి సోషల్ మీడియాలో ఓటిటి వద్దు.. థియేటర్స్ ముద్దు అంటూ ఓ ఉద్యమం నడుపుతున్నారు.
అయితే తాజాగా విజయ్ మాస్టర్ సినిమాకి ఓ బడా ఓటిటి సంస్థ 100 కోట్ల ఆఫర్ చేసినట్లుగా ఇప్పుదు సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతుంది. విజయ్ క్రేజ్ కి లోకేష్ కనకరాజ్ మీదున్న నమ్మకంతో ఓ బడా ఓటిటి సంస్థ మాస్టర్ కి 100 కోట్ల ఆఫర్ చేసిందట. మరి 100 కోట్ల ఆఫర్ నిజమే అయితే మాత్రం సౌత్ ఇండియాలో ఇదే బిగ్గెస్ట్ డీల్ అవుతుంది. కానీ మాస్టర్ నిర్మాతలు మాత్రం ఒకే మాటపై ఉన్నారు. థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత మా సినిమా విడుదలవుతుంది. అది కావాలంటే 2021 సంక్రాంతికి అయినా విడుదల చేస్తాం కానీ ఓటిటి వైపుకి మాత్రం రామంటున్నారు.