అభిమానులకు మహేష్ లేఖ.. ఇంతకీ ఏం చెప్పారో తెలుసా ?
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, మే 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతోంది. ఈ చిత్రం ఆడియో సరేగమ..
హైదరాబాద్ : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా మే 12 ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవలే విడుదలైన సినిమా ట్రైలర్.. సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది. సినిమా విడుదలకు కొద్దిరోజులే సమయం ఉండటంతో.. మహేష్ అభిమానులకు బహిరంగ లేఖ రాశారు. ప్రియమైన అభిమాన మిత్రులకు అంటూ మొదలు పెట్టి.. సర్కారు వారిపాట సినిమాను చూసి.. ఎలా ఉందో చెప్పాలని కోరారు. మహేశ్ అభిమానులకు రాసిన బహిరంగ లేఖ ఇలా ఉంది.
"ప్రముఖ యువ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్ మెంట్స్ , 14 రీల్స్ ప్లస్ వంటి ప్రముఖ సంస్థలపై, ఎర్నేని నవీన్, యలమంచిలి రవి, శంకర్, ఆచంట రామ్, ఆచంట గోపిలు సంయుక్తంగా నిర్మిస్తున్న సర్కారు వారి పాట షూటింగ్ పూర్తయి, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, మే 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతోంది. ఈ చిత్రం ఆడియో సరేగమ కంపెనీ ద్వారా మార్కెట్లో విడుదదలై, రేటింగ్ లో విశేష సంచలనం సృష్టిస్తోందిి. ఎన్నో అంచనాలతో, ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న మన సర్కారువారిపాట చిత్రం థియేటర్లలోనే చూసి మీ స్పందన తెలియజేయగలరు. మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై యస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మించేచిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ లో మొదలవుతుంది." అని మహేష్ అభిమానులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
కాగా.. సర్కారువారి పాట సినిమా ఈరోజు సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోనుంది. హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ గా ఎవరొస్తున్నారా అన్న దానిపైనే అందరి దృష్టీ నెలకొంది. మరోవైపు ఏపీ ప్రభుత్వం మహేష్ సినిమాకు శుభవార్త చెప్పింది. టికెట్ ధరపై రూ.45 పెంచుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. సినిమా విడుదలైన 10 రోజులవరకూ పెంచిన టికెట్ ధరలు అమల్లో ఉంటాయని పేర్కొంది.