మహేష్ బాబు ఇంట్లో విషాదం.. సోదరుడి మృతి

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు రమేష్ బాబు మృతి చెందారు.

Update: 2022-01-09 02:05 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో విషాదం నెలకొంది. కృష్ణ పెద్దకుమారుడు, మహేహ్ బాబుసోదరుడు రమేష్ బాబు కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులను ఆయనను ఏఐజీ ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందారు. రమేష్ బాబు వయసు 56 సంవత్సరాలు. రమేష్ బాబు కొన్ని సినిమాల్లో నటించారు.

ఈరోజు మధ్యాహ్నం....
ఆయన మృతి పట్ల టాలీవుడ్ లో ప్రముఖుల సంతాపాన్ని ప్రకటించారు. కోవిడ్ నిబంధనలకు కట్టుబడి, రమేష్ బాబు అంత్యక్రియల్లో గుమికూడ కుండా ఉండాలని ఘట్టమనేని కుటుంబం ఒక ప్రకటనలో కోరింది. రమేష్ బాబు తొలిసారి తన తండ్రి నటించిన అల్లూరి సీతారామరాజులో నటించారు. దాదాపు పదిహేను చిత్రాల్లో రమేష్ బాబు నటించారు. ఈ రోజు మధ్యాహ్నం మహాప్రస్థానంలో రమేష్ బాబు అంత్యక్రియలు జరగనున్నాయి.


Tags:    

Similar News