ఈ సెగ ఇప్పట్లో తగ్గదు!!

సుశాంత్ సింగ్ రాజపుట్ మరణానికి ఆయన అభిమానులు ఎంతగానో బాధపడుతున్నారు. సుశాంత్  మరణాన్ని జీర్ణించుకోలేని అభిమానులు బాలీవుడ్ నేపోటిజం పై నిప్పులు చెరుగుతున్నారు. సినీ నేపథ్యం ఉన్న [more]

Update: 2020-08-13 05:18 GMT

సుశాంత్ సింగ్ రాజపుట్ మరణానికి ఆయన అభిమానులు ఎంతగానో బాధపడుతున్నారు. సుశాంత్  మరణాన్ని జీర్ణించుకోలేని అభిమానులు బాలీవుడ్ నేపోటిజం పై నిప్పులు చెరుగుతున్నారు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబాల నుండి వచ్చిన స్టార్స్ ని సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నాడు. కనబడితే కొట్టేటట్లుగా ఉంది వ్యవహారం. ప్రస్తుతం కరోనా టైం వలన కనిపించడం లేదు గనక.. వాళ్ళని సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు. అలియా భట్ ని అస్సలు వదలడం లేదు. కారణం సుశాంత్ మరణానికి కారణమనుకుంటున్న రియా చక్రవర్తికి అలియా తండ్రి మహేష్ భట్ సహాయం చేసాడనే ప్రచారం ఉండడంతో అలియా భట్ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఇక, కరణ్ జోహార్, జాన్వీ కపూర్, సోనాక్షి, సిన్హా, సారా అలీ ఖాన్, రణబీర్ కపూర్ ఇలా ఎవ్వరిని వదలకుండా సుశాంత్ అభిమానులు రచ్చ  రచ్చ చేస్తున్నారు. వాళ్ళ సినిమాలు గనక థియేటర్స్ లో విడుదలైతే కలెక్షన్స్ పరంగా కోలుకునేవి కావు.

తాజాగా అలియా భట్ – సంజయ్ దత్ – పూజా భ‌ట్‌ – ఆదిత్య‌రాయ్ క‌పూర్ కాంబోలో మహేష్ భట్ దర్శక నిర్మాణంలో తెరకెక్కిన సడక్ 2 ని ఆడుకోవడానికి సుశాంత్ అభిమానులు కంకణం కట్టుకున్నారు. సడక్ 2 ట్రైలర్ నిన్న సోషల్ మీడియాలో విడుదలైంది. ఆ ట్రైలర్ కి వచ్చిన డిస్ లైక్స్ ఇంతవరకు ఏ ట్రైలర్ కి రాలేదంటే నమ్మాలి. సుశాంత్ సింగ్ రాజపుట్ అభిమానులు మహేష్ భట్ ఫ్యామిలీని వదలరు. మంచి కసిమీదున్నరేమో సడక్ 2 ట్రైలర్ ని అల్లకల్లోలం చేసారు. ఈ సినిమాపై సుశాంత్ మరణం వరకు అంచనాలుండేవి. కానీ ఆతర్వాత అంచనాల సంగతేమో.. సినిమాపై క్రేజ్ లేకుండా పోయింది. అందులోను ఈ సినిమా నేరుగా ఓటిటిలో విడుదలవుతుంది. అదే ఈ సినిమా థియేటర్స్ లో దిగితే సుశాంత్ సింగ్ రాజపుట్ మరణానినికి ఆగ్రహంతో ఉన్న అభిమానులు థియేటర్స్ ని ధ్వంశం చేసేవారే. మరి ఈ సెగ ఇప్పట్లో తగ్గేలా లేదు. 

Tags:    

Similar News