వాళ్ళలా ఆటలో అరటిపండు అవ్వడు కదా?

రాహుల్ రవీంద్రన్ కొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు. కానీ హీరోగా అవకాశాలు తగ్గాక కొన్ని సినిమాల్లో కేరెక్టర్ ఆర్టిస్ట్ గాను నటించాడు. శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు [more]

Update: 2019-10-21 07:34 GMT

రాహుల్ రవీంద్రన్ కొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు. కానీ హీరోగా అవకాశాలు తగ్గాక కొన్ని సినిమాల్లో కేరెక్టర్ ఆర్టిస్ట్ గాను నటించాడు. శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు బావగా కాసేపు కనిపించాడు. డబ్బు కోసం అయిన వాళ్లనే మోసం చేసే పాత్రలో అలా కనిపించి ఇలా మాయమయ్యాడు. ఇక అజ్ఞాతవాసి సినిమాలో ఆది పినిశెట్టి విలన్ గా చేసింది ఏమి లేదు. హీరోగా నటిస్తున్న ఆది పినిశెట్టి అజ్ఞాతవాసి సినిమాలో విలన్ గా నటించాడు. ఆ సినిమా డిజాస్టర్ సంగతలా పెడితే అందులో ఆది కేరెక్టర్ అంతగా అనిపించదు. మరి హీరోలై ఉండి ఇలా సినిమాల్లో ఆటలో అరటిపండు కేరెక్టర్స్ లో వాళ్లు నటించారు.

సుశాంత్ రోల్ ఏంటో…?

తాజాగా చి ల సౌ తో హిట్ కొట్టిన అక్కినేని కుర్రాడు సుశాంత్ ఇప్పుడు అల వైకుంఠపురములో ఓ కేరెక్టర్ చేస్తున్నాడు. నిన్న సుశాంత్ లుక్ బయటికొచ్చింది. ఆ లుక్ లో సుశాంత్ కాస్త స్టైలిష్ గా.. ఏ సాఫ్ట్ వేర్ జాబో చేస్తున్నవాడి లుక్ లా ఉంది. మరి హీరోగా కాస్త ఫామ్ లో కొచ్చిన సుశాంత్ కి త్రివిక్రమ్ ఎలాంటి కేరెక్టర్ ఇచ్చాడో అని అక్కనేని ఫాన్స్ కి టెన్షన్ పట్టుకుంది. ఇక సుశాంత్ రోల్ పాజిటివ్ గా ఉంటుందా? లేదంటే నెగెటివ్ గా ఉంటుందా? అనేది ఇంకా ఎక్కడా రివీల్ కాలేదు. మరి ఈ సినిమా హిట్ సంగతేమో కానీ సుశాంత్ ఆటలో అరటిపండు కాకుంటే చాలు.

 

Tags:    

Similar News