అలాంటి న్యూస్ లు వల్ల నేనేం బాధ పడలేదు?

బాలీవుడ్ లో చాలామంది డేటింగ్ చేస్తున్నప్పటికీ మా మధ్యన ఏం లేదు అని చెప్పినట్టుగానే… మరో బాలీవుడ్ జంట తాజాగా ఆ హీరో మధ్యన నా మధ్యన [more]

Update: 2020-04-21 05:34 GMT

బాలీవుడ్ లో చాలామంది డేటింగ్ చేస్తున్నప్పటికీ మా మధ్యన ఏం లేదు అని చెప్పినట్టుగానే… మరో బాలీవుడ్ జంట తాజాగా ఆ హీరో మధ్యన నా మధ్యన ఏం లేదు అంటుంది. సుశాంత్ సింగ్ రాజ్ ఫుట్ – రియా చక్రవర్తిలు చాల రోజులుగా చట్టాపట్టాలేసుకుని.. రెస్టారెంట్స్ లకు, వెకేషన్స్ కి వెళుతూ డేటింగ్ లో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. చాలా రోజులుగా ఇలాంటి వార్తలొస్తున్నప్పటికీ.. అటు రియా కానీ ఇటు సుశాంత్ కానీ పెదవి విప్పలేదు. అయితే తాజాగా రియా చక్రవర్తి.. తన లవ్ మేటర్ పై స్పందించింది.

అదేమిటంటే.. సుశాంత్ తనకి మంచి స్నేహితుడని, సుశాంత్ కి నాకు మధ్యన సం థింగ్ సం థింగ్ అంటూ వస్తున్న వార్తలపై తనకేమి బాధ కలగలేదని, ప్రజల దృష్టి అంతా.. సెలబ్రిటీస్ మీదనే ఉంటుంది అని, సెలబ్రిటీస్ వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని వారు చాలా ఆత్రుత చూపుతారని, ఎదుట వారి లైఫ్ లో ఏం జరుగుతుందో అనేది వాళ్ళు తెలుసుకుని ఆనందం పొందుతారని, అలాంటి వారు చెప్పే అబద్దాల వలన బాధపడాల్సిన అవసరం లేదని చెబుతుంది రియా. ఇక సినిమా లైఫ్ చాలా బావుంది అని చెప్పిన రియా చక్రవర్తి అసలు సినిమాల్లోకి రావాలని అనుకోనేలేదట. కానీ వచ్చాక మాత్రం తనని తాను నిరూపించుకోవాలని కసి పెరిగింది అని చెబుతుంది. 

Tags:    

Similar News