ఆవేశపడినంతసేపు లేదు!!

మెగా డాటర్ సుష్మిత తండ్రి సినిమాలకు, తమ్ముడి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు తాజాగా ప్రొడ్యూసర్ గా కూడా మారింది. అయితే సుష్మిత [more]

Update: 2020-07-26 04:37 GMT

మెగా డాటర్ సుష్మిత తండ్రి సినిమాలకు, తమ్ముడి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు తాజాగా ప్రొడ్యూసర్ గా కూడా మారింది. అయితే సుష్మిత సినిమాల నిర్మాణం సంగతి అటుంచి.. ప్రస్తుతం వెబ్ సిరీస్ ప్లాన్ చెయ్యడమే కాదు.. దానిని మొదలు పెట్టింది కూడా. కూతరు తల్లి తో వెబ్ సీరీస్ ఓపెనింగ్ చేసిన సుష్మితకి తండ్రి చిరు ఆశీస్సులు పుష్కలంగానే ఉన్నాయి. మరి సుష్మిత ఆవేశపడి వెబ్ సీరీస్ ఓపెనింగ్ చేసిందో లేదో.. కరోనా సుష్మితకి షాకిచ్చింది. కరోనా వలన పెద్ద పెద్ద సినిమా షూటింగ్ మొత్తం మూలనపడ్డాయి. షూటింగ్స్ కి అనుమతులొచ్చాయి.. కరోనా ఉంటే ఏమవుతుంది..ఆనుకున్న సుష్మిత వెబ్ సీరీస్ ని గ్రాండ్ గా లాంచ్ చేసింది.

కానీ ఆవేశపడినంతసేపు లేకుండానే వెబ్ సీరీస్ ఆగిపోయింది. కారణం అందరూ అనుకున్నట్టుగానే కరోననే. కరోనా ఉన్నా షూటింగ్ మొదలుపెట్టిన సుష్మితకి కరోనా బాగా షాకిచ్చింది. తన టీంలోనే కొందరికి కరోనా పాజిటివ్ రావడంతో సుష్మిత ఉన్నపలంగా వెబ్ సీరీస్ నిర్మాణాన్ని ఆపెయ్యాల్సి వచ్చింది. మరి మహా మహా దర్శకులే కరొనకి భయపడి ఇంట్లో కూర్చుంటే మెగా డాటర్ మాత్రం కరోనని లెక్క చెయ్యకుండా వెబ్ సీరీస్ నిర్మాణం మొదలు పెట్టింది కరోనా కి బుక్కైంది. మరి టీంలో కొందరికి కరోనా అంటే ఖచ్చితంగా సుష్మిత కూడా హోమ్ ఐసోలేషన్ లోనే ఉండాలిగా.. అది సంగతి.

Tags:    

Similar News