దసరా హడావిడేది

సినీప్రియులకి దసరా, సంక్రాతి పండగలు పెద్ద పండగలు. చిన్న, పెద్ద సినిమాల హడావుడితో పండగలు జరుపుకుంటారు. టాలీవుడ్ లో ఈ రెండు పెద్ద పండగలకు భారీ బడ్జెట్ [more]

Update: 2019-10-06 06:05 GMT

సినీప్రియులకి దసరా, సంక్రాతి పండగలు పెద్ద పండగలు. చిన్న, పెద్ద సినిమాల హడావుడితో పండగలు జరుపుకుంటారు. టాలీవుడ్ లో ఈ రెండు పెద్ద పండగలకు భారీ బడ్జెట్ సినిమాలు విడుదలవుతుంటాయి. ఈ దసరాకి చిరు సై రా నరసింహారెడ్డి సినిమా తో పాటుగా గోపీచంద్ చాణక్య, శ్రీనివాస్ అవసరాల ఊరంతా అనుకుంటున్నారు సినిమాలు విడుదలయ్యాయి. సై రా సినిమాకి హిట్ టాక్ పడింది. మొదటిరోజు భారీ ఓపెనింగ్స్ రెండు తెలుగు రాష్ట్రాలలోను నమోదు చేసిన సై రా రెండో రేజు అంటే వీక్ డే గురువారం వసూళ్ళలో డ్రాప్ కనబడింది. ఇక ఈ వీకెండ్ లో సై రా సత్తా తెలిసిపోతుంది.

ఇక తాజాగా నిన్న శనివారం విడుదలైన గోపీచంద్ చాణక్యకి ప్లాప్ టాక్ రాగా… శ్రీనివాస్ అవసరాల ఊరంతా అనుకుంటున్నారు సినిమాకి ప్లాప్ టాక్ పడింది. గోపీచంద్ చాణక్య సినిమాకి రొటీన్ సినిమాలా ఉందని… అవుట్ డేటెడ్ కథ అయినా స్క్రీన్ ప్లే బావోలేదని ప్రేక్షకులే కాదు.. క్రిటిక్స్ కూడా అంటున్న మాట. చాణక్య సినిమాలో నిర్మాణ విలువలు, గోపీచంద్ పెరఫార్మెన్స్ తప్ప మరేది ఆకట్టుకునేలా లేదంటున్నారు. ఇక శ్రీనివాస్ అవసరాల ఊరంతా అనుకుంటున్నారు సినిమాకి కూడా ప్రేక్షకులు ప్లాప్ టాక్ ఇచ్చారు. బాలాజీ సనాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కినది . కథలోని మెయిన్ కాన్సెప్ట్ ను వదిలేసి, అనవసరమైన ట్రాక్ లతో సినిమాని నింపడం సినిమా ఫలితాన్ని పూర్తిగా దెబ్బ తీసింది. దానితో సినిమాని ప్రేక్షకులు తిప్పికొట్టారు. మరి సై రా హిట్ అయినా.. కలెక్షన్స్ లేవు. మిగతా రెండు ప్లాప్ తో నడుస్తున్నాయి

Tags:    

Similar News