అందుకే ఆ రోల్ చేస్తుందా?

తమన్నా కి బాహుబలి తర్వాత మళ్ళీ చెప్పుకోదగిన సినిమాలేవీ పడకపోయినా.. తమన్నా మాత్రం ఒక్క నిమిషం ఖాళీగా ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఏదో ఒక సినిమా చేస్తూనే [more]

Update: 2020-09-21 06:28 GMT

తమన్నా కి బాహుబలి తర్వాత మళ్ళీ చెప్పుకోదగిన సినిమాలేవీ పడకపోయినా.. తమన్నా మాత్రం ఒక్క నిమిషం ఖాళీగా ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఏదో ఒక సినిమా చేస్తూనే ఉంది. పారితోషకం భారీగా ఉంటె ఐటెం సాంగ్స్ కూడా దున్నేస్తుంది. ప్రస్తుతం ఫెడవుడ్ లిస్ట్ కి దగ్గరగా ఉన్న తమన్నా కి ఏ అవకాశం వచ్చినా వదలడం లేదు. తాజాగా నితిన్ బాలీవుడ్ అంధధూన్ సినిమాలో తమన్నా నెగెటివ్ రోల్ లో నటించబోతుంది. హిందీలో అంధధూన్ సినిమాలో ఈ నెగెటివ్ రోల్ లో టబు నటించింది. ఆ బోల్డ్ పెరఫార్మెన్సు కి అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడు అదే రోల్ ని తెలుగులో తమన్నా చేస్తుంది. నిన్నమొన్నటివరకు అనసూయ, రమ్యకృష్ణ, ఇలియానా , నయనతార పేర్లు వినబడినా శ్రియ ఫైనల్ అన్నాక ఆమె వేరే దేశంలో ఉండడంతో చివరికి ఆ బోల్డ్ ఛాన్స్ తమన్నాకి దొరికింది.

ఇంకా హీరోయిన్ గా కంటిన్యూ చేస్తున్న తమన్నా ఈ బోల్డ్ పాత్ర చెయ్యడం కాస్త షాకింగ్ గా అనిపించినా… ఆమె పారితోషకానికి పడిపోయింది అనే టాక్ మొదలైంది. అంధధూన్ రీమేక్ లో తమన్నా నెగెటివ్ షేడ్స్ ఉన్న బోల్డ్ పాత్ర చెయ్యడానికి నితిన్ నిర్మాతలు నుండి ఏకంగా కోటిన్నర పట్టుకెళుతుందట. మరి హీరోయిన్ గా ఇంకా చేతిలో సినిమాలు ఉన్న టైం లో లో తెగించి బోల్డ్ నెగెటివ్ పాత్ర చెయ్యడానికి కోటిన్నరే కారణమంటున్నారు. ఫెడవుట్ అయ్యే టైం లో ఎలాంటి పాత్ర అయినా చేయాలనీ తమన్నా డిసైడ్ అయినట్లుగా కనిపిస్తుంది. అయితే టబు చేసిన ఆ పాత్ర ని తమన్నా రక్తి కట్టించగలదా అనే సందేహాలు కూడా చాలామందిలో ఉన్నాయి.

Tags:    

Similar News