Vijayakanth : తమిళ నటుడు విజయకాంత్ కన్నుమూశారు..
తమిళ నటుడు, రాజకీయ నాయకుడు విజయకాంత్.. 71 ఏళ్ళ వయసులో నేడు కన్నుమూశారు.
Vijayakanth : తమిళ నటుడు, రాజకీయ నాయకుడు విజయకాంత్.. 71 ఏళ్ళ వయసులో నేడు కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న విజయకాంత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన రీసెంట్ గా కరోనా భారిన పడ్డారు. శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా ఉండడంతో ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందించక సాగారు.
చెన్నై మియోట్ హాస్పిటల్ అలా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూనే విజయకాంత్.. గురువారం ఉదయం కన్నుమూసినట్లు వైధ్యులు బులిటెన్ విడుదల చేశారు. కాగా విజయకాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్‌స్వామి. ఈయన 1952 ఆగష్టు 25న మధురైలో జన్మించారు. 1979లో ‘ఇనిక్కుం ఇలామై’ సినిమాలో నటించి 27 ఏళ్ల వయసులో యాక్టింగ్ కెరీర్ ని స్టార్ట్ చేశారు.
కెరీర్ లో 100కి పైగా సినిమాల్లో నటించిన విజయకాంత్.. 20కి పైగా సినిమాల్లో పోలీసుగా కనిపించడం విశేషం. యాక్షన్ హీరోగా సూపర్ స్టార్‌డమ్ ని సంపాదించుకున్న విజయకాంత్.. తన 100వ చిత్రంగా ‘కెప్టెన్ ప్రభాకర్’ చేశారు. అది భారీ విజయం అవ్వడంతో అప్పటినుంచి అభిమానులు ఆయనని కెప్టెన్ అని పిలవడం మొదలుపెట్టారు. ఇక సినిమాల్లో ఎంతో ప్రజాధారణ పొందిన ఆయన.. 2005లో డీఎండీకే రాజకీయ పార్టీ స్థాపించి ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. రాజకీయాల్లోనూ తనదైన మార్క్ వేశారు.