లవ్ కి బ్రేకప్ ఉంటుంది కానీ.. స్నేహానికి ఉండదు

ఈమాట అన్నది ఎవరో కాదు.. తెలుగు హీరోయిన్ అంజలి. కోలీవుడ్ హీరో జై, అంజలి ప్రేమలో ఉన్నారని, వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే న్యూస్ గతంలో కోలీవుడ్ [more]

Update: 2019-12-20 06:18 GMT

ఈమాట అన్నది ఎవరో కాదు.. తెలుగు హీరోయిన్ అంజలి. కోలీవుడ్ హీరో జై, అంజలి ప్రేమలో ఉన్నారని, వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే న్యూస్ గతంలో కోలీవుడ్ లో తెగ హల్చల్ చేసింది. అంజలి, జై లు కలిసి రెండు మూడు సినిమాలు చేసేసరికి.. వారి మధ్యన ప్రేమ మొదలైందని అందుకే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని అందరూ ఫిక్స్ అయ్యారు. ఇక బెలూన్ సినిమా తర్వాత అంజలి, జై కి బ్రేకప్ అయ్యింది కాబట్టి. ఇద్దరు కలిసి కనబడడం లేదన్నారు. అయితే ఈ ప్రేమ, బ్రేకప్ విషయంలో అంజలి కానీ జై కానీ ఎక్కడా స్పందించలేదు కానీ.. ఓ కోలీవుడ్ నిర్మాత మాత్రం జై వలన అంజలి దారితప్పింది, జై చేష్టలతో అంజలి అవకాశాలు చేజార్చుకుంది అని మొన్నామధ్యన ఆరోపణలు చేసాడు.

అయితే ఇన్ని జరిగినా అంజలి కానీ జై కానీ ఎక్కడా పెదవి విప్పలేదు. తాజాగా పవన్ కళ్యాణ్ పింక్ సినిమా రీమేక్ లో అంజలి నటించబోతుందనే న్యూస్ వినబడుతుంది. మరోపక్క నిశ్శబ్దం సినిమాలో అంజలి పోలీస్ గా నటిస్తుంది. అయితే తాజగా జై తాను మంచి ఫ్రెండ్స్ అని, మా ఇద్దరి మధ్యన బ్రేకప్ లాంటిదేం లేదని, అయితే ప్రేమకి బ్రేకప్ ఉంటుంది కానీ, స్నేహానికి బ్రేకప్ ఉండదని, తామిద్దరం మంచి స్నేహితులం అని, కాకపోతే కలిసి నటించే అవకాశాలు లేక ఇద్దరం కలిసి సినిమాలు చెయ్యలేదు అంతే కానీ… మా మధ్యన విభేదాలేం లేవని తేల్చి చెప్పేసింది.

Tags:    

Similar News