Vijay : 800 కుటుంబాలకు విజయ్ సాయం.. 50వేల వరకు..

రీసెంట్ గా వచ్చిన మిచౌంగ్‌ తుపానుతో నష్టపోయిన సుమారు 800 కుటుంబాలకు హీరో విజయ్ సాయం. ఆ వరదలు వల్ల..;

Update: 2023-12-30 14:38 GMT
Vijay, michaung cyclone, Thalapathy 68
  • whatsapp icon
Vijay : తమిళ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలతో ఎంతటి క్రేజ్ ని సంపాదించుకున్నారో.. అంతకుమించి అభిమానాన్ని తన మంచి మనసుతో సంపాదించుకున్నారు. తన అభిమాన సంఘాలు ద్వారా విజయ్ ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తారు, ఎంతోమందికి చేయూతని అందిస్తారు.
కాగా రీసెంట్ గా వచ్చిన మిచౌంగ్‌ తుపాను తమిళనాడులోని కొన్ని ప్రాంతాలను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. వరద నీరు ఇళ్లలోకి పొంగుకొచ్చి మొత్తం అంతటిని నాశనం చేసింది. ఈ తుఫాను వల్ల తమిళ హీరోలు సైతం రోడ్డు మీదకి వచ్చారు. ఇప్పుడు వరద తగ్గింది, కానీ అది తెచ్చిన నష్టం మాత్రం అలాగే ఉంది. దీంతో వరద వల్ల నష్టపోయిన పేద ప్రజలకు విజయ్ తాను ఉన్నానంటూ ముందుకు వచ్చారు.
వరదలు సమయంలో కూడా విజయ్ తన అభిమాన సంఘాల ద్వారా ప్రజలకు సహాయం చేశారు. ఇప్పుడు తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాలలోని ప్రజలు ఎక్కువగా నష్టపోయారు అని తెలుసుకున్న విజయ్.. తీవ్రంగా నష్టపోయిన దాదాపు 800 కుటుంబాలకు నిత్యావసర సరుకులను తానే స్వయంగా అందజేసి తాను ఉన్నన్ని ధైర్యాన్ని ఇచ్చారు.
అంతేకాదు ఈ వరదలు వల్ల ఇంటిని కోల్పోయిన కుటుంబాలకు రూ.50వేల వరకు డబ్బు సాయం కూడా చేశారు. ఇక తమ కష్ట సమయంలో ఆదుకోవడానికి వచ్చిన విజయ్‌ని.. భాద్యతలంతా నమస్కరిస్తూ, ముద్దాడుతూ తమ ప్రేమని, గౌరవాన్ని తెలియజేసారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఇవి చూసిన తెలుగు ఆడియన్స్ సైతం.. విజయ్ కి సెల్యూట్ చేస్తున్నారు.
Tags:    

Similar News