Pallavi Prashanth : బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ప్లస్, మైనస్‌లు ఇవే..

బిగ్‌బాస్ 7 టైటిల్ అందుకున్న పల్లవి ప్రశాంత్ లో ప్లస్‌లు ఏంటి..? మైనస్‌లు ఏంటి..?

Update: 2023-12-18 06:51 GMT

Bigg Boss 7 winner

Pallavi Prashanth : బిగ్‌బాస్ సీజన్ 7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ టైటిల్ ని అందుకున్నాడు. ఈ సీజన్ లో దాదాపు అందరూ సినీ మరియు బుల్లితెర పరిశ్రమకి చెందిన వారే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రశాంత్ ఒక కామన్ మ్యాన్ గా ఈ సీజన్ కంటెస్టెంట్ గా ఆడియన్స్ కి పరిచయం అయ్యాడు. బిగ్‌బాస్ కి వెళ్లడం తన కల అంటూ సోషల్ మీడియాలో అనేక వీడియోలు చేసే ప్రశాంత్.. నేడు బిగ్‌బాస్ కి వచ్చి టైటిల్‌నే గెలుచుకొని వెళ్ళాడు. హౌస్ లో తనని గైడ్ చేసిన తన గురువు శివాజీని కూడా వెనక్కినెట్టి విజేతగా నిలిచాడు. మరి టైటిల్ అందుకున్న పల్లవి ప్రశాంత్ లో ప్లస్‌లు ఏంటి..? మైనస్‌లు ఏంటి..?

ప్లస్‌ పాయింట్స్..
ఒక కామన్ మ్యాన్ గా వచ్చిన పల్లవి ప్రశాంత్.. రైతుబిడ్డ అనే ట్యాగ్ తో ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. హౌస్ లో నిత్యం తాను ఒక రైతుబిడ్డనని, తాను విన్నర్ అయితే రైతులకు సహాయం చేస్తానని అంటూ పదేపదే చెప్పడంతో కొందరు ఆడియన్స్ అతడికి కనెక్ట్ అయ్యారు. ఇక హౌస్ లో ప్రశాంత్ కి పెద్ద ప్లస్ అంటే శివాజీ. ఈ నటుడు గైడెన్స్ లో ప్రశాంత్ గేమ్ ని చాలా జాగ్రత్తగా ఆడుతూ వచ్చాడు. శివాజీ చెప్పే సలహాలు తీసుకుంటూనే తన ఆలోచనలతో కూడా గేమ్ ఆడి ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు.
గేమ్స్, టాస్క్ ల్లో ఫిసికల్‌గా, మెంటల్‌గా ఎంత బాధపడ్డా.. పోరాడి కెప్టెన్ అయ్యాడు, పవర్ అస్త్రా గెలుచుకున్నాడు, ఎవిక్షన్ ఫ్రీ పాస్ సాధించాడు. ఇక హౌస్ లో ప్రశాంత్ కి జరిగిన మరో ప్లస్ ఏంటంటే.. వచ్చి రాగానే రతికతో ప్రేమాయణం నడపడం, అందులో రతిక నుంచి ఎదురుదెబ్బ ఎదుర్కోవడంతో ప్రశాంత్ ని ప్రేక్షకులందరి దృష్టిలో పడేలా చేసింది. అక్కడి నుంచే ప్రశాంత్ ని ఆడియన్స్ గమనిస్తూ వచ్చారు.
మైనస్ పాయింట్స్..
రైతుబిడ్డ అనే ట్యాగ్ ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్.. పదేపదే ఆ పదాన్ని వాడుతూ సింపథీ కోసం ప్రయత్నించడం కొంధైర్ ఆడియన్స్ కి చిరాకు తెప్పించింది. ఇక హౌస్ లో నామినేషన్స్ సమయంలో తప్ప ఇతర సందర్భాల్లో ప్రశాంత్ ఫైట్ చేసిన సంఘటనలు లేవు. వారం మొత్తం సైలెంట్ ఉండి, కేవలం నామినేషన్స్ సమయంలో మాత్రమే మాట్లాడే వాడు. ఇక గురు శివాజీ అడుగుజాడల్లో పయనించి బాగానే ఆడినా.. కొన్ని సందర్భాల్లో తన ఆట తను ఆడడం మానేసి శివాజీ చేతిలో ఆట బొమ్మలా కనిపించాడు. అలాగే మాట్లాడితే కన్నీళ్లు పెట్టుకోవడం, ఒక సమస్య ఎదురైనప్పుడు తను పరిష్కారం ఆలోచించకుండా శివాజీ వంటి వారిని అడగడం ఆడియన్స్ ని కొంచెం విసుగు తెప్పించాయి. కానీ ఏదైమైనా చివరికి మాత్రం గురువుని ముంచేసి మరి టైటిల్ ని సొంతం చేసుకున్నాడు.

Full View

Tags:    

Similar News