పాపం 30 ఇయర్స్ పృద్వి కష్టాలు

సినిమాల్లో దూసుకుపోయే 30 ఇయర్స్ పృథ్వి.. రాజకీయాల్లో చేరి వైసీపీ నుండి అంతే ఫాస్ట్ గా ఎదిగాడు. వైసీపీ మనిషిగా తిరుపతి లో SVB ఛానల్ చైర్మన్ [more]

Update: 2020-01-24 08:27 GMT

సినిమాల్లో దూసుకుపోయే 30 ఇయర్స్ పృథ్వి.. రాజకీయాల్లో చేరి వైసీపీ నుండి అంతే ఫాస్ట్ గా ఎదిగాడు. వైసీపీ మనిషిగా తిరుపతి లో SVB ఛానల్ చైర్మన్ గా పదవి చేపట్టాడు. ఆ పదవిలోకి వెళ్ళాక పృద్వి రాజ్ సినిమా ప్రముఖులను, ప్రతిపక్ష రాజకీయనేతలను టార్గెట్ చేస్తూ అందరిని ఓ ఆట ఆడుకున్నాడు. వైసిపి ప్రభుత్వాన్ని చూసి వీరలెవల్లో రెచ్చిపోయాడు. అయితే SVB ఛానల్ చైర్మన్ గా పృద్వి ఆగడాలు ఒక్కొక్కటిగా బయటికి రావడంతో.. పృద్వి నెమ్మదిగా ఆ చైర్మన్ పదవికి రాజీనామా చేసి సైలెంట్ అయ్యాడు. అలా అనుకోకుండా రాజకీయాల్లో చుక్కెదురైన పృద్వి కి సినిమాల్లోనూ ఓ హిట్ ఛాన్స్ మిస్ అయ్యిందనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

తాజాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల వైకుంఠపురములో పృద్వి కి ఓ ఛాన్స్ మిస్ అయినట్లుగా ఆ ఛాన్స్ హర్షవర్ధన్ కి తగిలినట్లుగా ఫిలింనగర్ టాక్. అలా వైకుంఠపురములో నెగెటివ్ షేడ్స్ ఉన్న హర్షవర్ధన్ పాత్ర పృద్వి కే రావాల్సింది. కానీ జనసేన అధ్యక్షుడు పవన్ మీద పృద్వి చేసిన వ్యాఖ్యల ఫలితంగా పృద్వికి ఆ ఛాన్స్ మిస్ అయినట్లుగా చెబుతున్నారు. మరి హర్షవర్ధన్ ఆ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రకి మంచి మార్కులే పడ్డాయి. ఆలా పృద్వి రాజకీయాల్లోనూ, ఇటు సినిమాల్లోనూ ఒకేసారి బాగా నష్టపోయాడంటూ సోషల్ మీడియాలో జాలితో కూడిన కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News