‘మా’ లో సభ్యుల కంటతడి

మా లో లుకలుకలు అంటూ గత కొంతకాలంగా మీడియాలో హాట్ హాట్ గా ప్రచారం జరుగుతూనే ఉంది. నరేష్ మా అధ్యక్షుడు అయ్యాక కూడా మాజీ అధ్యక్షుడు [more]

Update: 2019-10-20 11:22 GMT

మా లో లుకలుకలు అంటూ గత కొంతకాలంగా మీడియాలో హాట్ హాట్ గా ప్రచారం జరుగుతూనే ఉంది. నరేష్ మా అధ్యక్షుడు అయ్యాక కూడా మాజీ అధ్యక్షుడు శివాజి రాజా చాలా విషయాల్లో నరేష్ వర్గంతో విభేదిస్తూనే ఉన్నాడు. జీవిత రాజశేఖర్ కూడా నరేష్ తో విభేదించడంతో మా లో జరుగుతున్న చిన్న విషయాలు కూడా పెద్దవిగా ప్రచారం జరుగుతున్నాయి. మధ్యలో మా సభ్యులు రాజశేఖర్ వంటి వాళ్ళు.. మా లో గొడవలేం లేవు.. అన్నీ పుకార్లని కొట్టిపారేస్తున్నప్పటికీ.. ఆ విభేదాలు ప్రస్తుతం తారాస్థాయికి చేరాయి.

తాజాగా మా జనరల్ బాడీ మీటింగ్ లో కొంతమంది మా మెంబెర్స్ కంటతడి పెట్టుకుంటూ మీటింగ్ నుండి వెళ్లిపోవడం చూస్తుంటే…. ఆ విభేదాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్ధమవుతుంది. జనరల్ బాడీ మీటింగ్ కోసం సన్నాహాలు చేస్తే… ఆ మీటింగ్ మా అధ్యక్షుడు అడ్డు చెప్పడమే కాదు… కోర్టు నుండి తన లాయర్ల ద్వారా.. దానికి సమాధానంగా జీవిత రాజశేఖర్ లు ఇది జనరల్ బాడీ మీటింగ్ కాదు, జనరల్ మీటింగ్ అని నరేష్ లాయర్లకు రిప్లై పంపి.. యధావిధిగా ఈ రోజు జనరల్ మీటింగ్ ఏర్పాట్లు చేసారు. అయితే ఈ మీటింగ్ లో శివాజీ రాజా, రాజశేఖర్ వర్గీయులు మధ్య మాటల యుద్ధం జరగడంతో.. కొంతమంది మా సభ్యులు కంట తడిపెడుతూ.. ఆ మీటింగ్ నుండి వాకవుట్ చెయ్యగా… మిగతా వారు ఇంకా మీటింగ్ లోనే ఉన్నారు.

Tags:    

Similar News