ఫిల్మ్ ఇండస్ట్రీ..ఇదేమి సంసృతి?

Update: 2018-12-12 08:44 GMT

డిసెంబర్ 7 న జరిగిన ఎన్నికల్లో తెరాస పార్టీ ఘన విజయం సాధించింది. భారీ మెజారిటీతో తెరాస తిరుగు లేని విజయం సాధించింది. అయితే గెలుపు ఎవరి వెంట ఉంటె వారి దగ్గరే ఉండే మన ఫిల్మ్ ఇండస్ట్రీ ఎన్నడూ లేని విధంగా ఈసారి మన సినీ స్టార్స్ సోషల్ మీడియా లో తెరాస కు అభినందనలతో కొంచం అతి చేశారు. రెండేళ్ల ముందువరకు అంటి ముట్టనట్టుగా ఉండే మనోళ్లకు ఒకేసారి ఇంత ప్రేమ ఎందుకు వచ్చిందో?

వాస్తవానికి 2014 ఎన్నికల్లో తరువాత ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం.. ఏ అవసరం వచ్చినా ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లేవారు. ఆయనతో అన్ని పరిష్కరించుకొనేవారు . ఏ సమస్య ఉన్న ఆయనతోనే చెప్పునే వాళ్ళు. కానీ తెరాస లో తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి అయిన తర్వాత ఫిలిం ఇండస్ట్రీ కి మొత్తం హెచ్చరికలే జారీ చేశారు. తెలంగాణాలో ఉండి ఆంధ్ర సీఎం ను కలిసేదేంటి? చంద్రబాబు వద్దకు వెళ్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సో అప్పుడునుండి ఆ భయంతో అంతా తెలంగాణ ప్రభుత్వ పెద్దల దగ్గరే వెళ్లడం ప్రారంభించారు.

ముఖ్యంగా డ్రగ్స్ కేసు విషయం అప్పుడు టాలీవుడ్ నుండి చాలామంది కేటీఆర్ ని కలిశారు. ఇండస్ట్రీ మొత్తం ఒక ఊపు ఊపేసిన డ్రగ్స్ కేసు చాలా రోజుల తరువాత చల్లబడించి. మరి తేర వెనుక ఏమి జరిగిందో తెలియదు కానీ అప్పటి నుండి మంత్రి కేటీఆర్ తో రెగ్యులర్ టచ్ లో ఉండటం..ఆడియో ఫంక్షన్స్ కి పిలవడం వంటివి స్టార్ట్ చేశారు మనోళ్లు. నాగార్జున లాంటి సీనియర్ యాక్టర్ సైతం తెరాస జపం చేయటం స్టార్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తరువాత నాగార్జున కు సంబందించిన కొన్ని ల్యాండ్స్ విషయం లో కలగజేసుకుంది తెరాస ప్రభుత్వం . అప్పటి నుండి నాగార్జున తెరాస జపం చేయడం స్టార్ట్ చేశాడు. మరి అంత క్లోజ్ గా ఉన్న మన స్టార్స్ తెరాస ఎలక్షన్స్ వచ్చేసరికి ముఖం చాటేశారు. ఒక్కరు అంటే ఒక్కరు కూడా వచ్చి ప్రచారం చేయలేదు. కానీ సోషల్ మీడియాలో స్టేట్ మెంట్స్ ఇచ్చారు. అల్ ది బెస్ట్ అని. ఇవి తప్ప ఏమి చేయలేదు. కానీ గెలిచిన తరువాత అందరూ వరుసగా.. అభినందనలు చెప్పడం ప్రారంభించారు. మరి ఇదేమి సంసృతో అర్ధం కావట్లేదు.

Similar News